రాజ్‌తరుణ్, వర్షా బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్టాండప్ రాహుల్’. రానా దగ్గుబాటి శుక్రవారం టీజర్ విడుదల చేశారు. ‘నవ్వించాలంటే ముందు ఏడుపేంటో తెలియాలి’ అని రాజ్‌తరుణ్‌తో ఓ పాత్రధారి చెప్పే మాటలు, ‘అబ్బాయి సింగిల్‌గా ఉంటే పులి అవుతాడు. అదే అమ్మాయితో ఉంటే పులిహోర అవుతాడు’ అని రాజ్‌తరుణ్ చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచాయి. అంతకు ముందు సన్నివేశాలు, ‘వెన్నెల’ కిశోర్ పాత్ర వినోదాత్మకంగా సాగాయి. హీరో హీరోయిన్... ఇద్దరూ స్టాండప్ కమెడియన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నందకుమార్ అభినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. మురళీ శర్మ, ఇంద్రజ, దేవి ప్రసాద్, మధురిమ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: స్వీకర్ అగస్తి, సమర్పణ: సిద్ధు ముద్ద.