RRR: ఇంటర్నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’

ABN , First Publish Date - 2022-11-30T20:57:38+05:30 IST

దర్శకధీరుడు ఎస్‌ఎస్.రాజమౌళి (SS. Rajamouli) తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు.

RRR: ఇంటర్నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’

దర్శకధీరుడు ఎస్‌ఎస్.రాజమౌళి (SS. Rajamouli) తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చాక వెస్ట్రన్స్ ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారు. హాలీవుడ్‌కు చెందిన అనేక మంది ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రం అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో పోటీపడుతుంది.    


‘ఆర్ఆర్ఆర్’ తాజాగా ఓ అవార్డును గెలుచుకుంది. సన్‌సెట్ సర్కిల్ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో విజేతగా నిలిచింది. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో ఈ చిత్రం రన్నరప్‌ అవార్డును సొంతం చేసుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ శాటర్న్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్స్ పురస్కారాల్లోను ఈ సినిమా సత్తా చాటింది. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ బరిలోను నిలిచింది. వివిధ కేటగిరిల్లో అకాడమీ అవార్డు కోసం పోటీపడుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ ను 1920ల బ్యాక్ డ్రాప్‌లో ఫిక్షనల్ స్టోరీగా రూపొందించారు. స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీత రామ రాజు, కొమరం భీమ్‌లను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, శ్రియ శరణ్, సముద్ర ఖని, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే జపాన్‌లో విడుదలైంది. ఆ దేశంలోను రికార్డులు క్రియేట్ చేస్తుంది. అత్యంత వేగంగా 300మిలియన్ జపనీస్ యెన్స్‌ను సాధించిన సినిమాగా రికార్డును నెలకొల్పింది.  




Updated Date - 2022-11-30T20:57:38+05:30 IST