నెట్‌ఫ్లిక్స్‌లోకి ముందుగానే వచ్చేస్తున్న RRR హిందీ వెర్షన్

ABN , First Publish Date - 2022-05-19T22:29:03+05:30 IST

దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్

నెట్‌ఫ్లిక్స్‌లోకి ముందుగానే వచ్చేస్తున్న RRR హిందీ వెర్షన్

దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్ (Ajay Devgan), ఆలియా భట్ (Alia Bhatt) కీలక పాత్రలు పోషించారు. మార్చి 25న విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1127కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టిన నాలుగో భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ విజువల్ వండర్‌ను థియేటర్స్‌లో మిస్ అయిన వారంతా ఓటీటీలో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నారు. సినీ ప్రేక్షకుల ఎదురు చూపులకు తెరదించుతూ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మూవీ స్ట్రీమీంగ్ డేట్‌ను ప్రకటించింది. 


‘ఆర్‌ఆర్‌ఆర్’ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్టు గతంలో ఓటీటీ ప్లాట్‌ఫాం ప్రకటించింది. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకుని ముందుగానే మే 20నుంచి ప్రేక్షకులందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ దక్షిణాది భాషల్లో ‘జీ-5’లో మే 20నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ను ముందుగా పే ఫర్ వ్యూ పద్ధతిలో వీక్షకులకు అందుబాటులోకి తీసుకువస్తామని గతంలో ‘జీ-5’ సంస్థ పేర్కొంది. కానీ, ఆ నిర్ణయాన్ని ప్రేక్షకులు స్వాగతించలేదు. దీంతో సాధారణ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని డబ్బులను వసూలు చేయడం లేదని ప్రకటించింది. సాధారణ చందాదారులందరికీ ‘ఆర్ఆర్ఆర్’ (RRR)ను ఫ్రీ గా చూసే అవకాశం కల్పిస్తామని తెలిపింది. ‘జీ-5’ సబ్‌స్ర్కైబర్స్ అందరికీ రేపటి నుంచే ఉచితంగా చిత్రాన్ని వీక్షించే అవకాశం ఇస్తుండంతో ‘నెట్‌ఫ్లిక్స్’ కూడా స్ట్రీమింగ్ డేట్‌ను మార్చింది.



Updated Date - 2022-05-19T22:29:03+05:30 IST