కేసు బతికే ఉంది.. ఎదుర్కొవడానికి రెడీగా ఉండు... శ్యామ్.కె.నాయుడుకి శ్రీసుధ సవాల్!
ABN , First Publish Date - 2022-02-07T22:33:35+05:30 IST
క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీసుధతో ఐదేళ్లు సహజీవనం చేసి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేసిన కెమెరామెన్ శ్యామ్.కె.నాయుడుపై కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే! తనకు శ్యామ్‌తో ప్రాణహాని ఉందనే భయంతో శ్రీసుధ అతనికి బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటీషన్‌ను సుప్రీమ్ కోర్టు ఇటీవల కొట్టివేసింది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీసుధతో ఐదేళ్లు సహజీవనం చేసి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేసిన కెమెరామెన్ శ్యామ్.కె.నాయుడుపై కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే! తనకు శ్యామ్‌తో ప్రాణహాని ఉందనే భయంతో శ్రీసుధ అతనికి బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటీషన్‌ను సుప్రీమ్ కోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ విషయంపై నటి సుధ ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు. ‘‘బెయిల్ రద్దు అయ్యి నీకు మాత్రమే కోర్టులో ఊరట లభించింది. కేసు ఇంకా బతికే ఉంది. నేను కూడా నువ్వు చేసిన అన్యాయంపై పోరాడటానికి సిద్ధంగా ఉన్నా. మున్ముందు ఎదురయ్యే సెషన్స్‌ను ఎదుర్కొవడానికి రెడీగా ఉండు’’ అని శ్రీసుధ పోస్ట్ చేశారు. ఇంత జరిగిన తర్వాత కేసును వదిలిపెట్టేదే లేదని ఆమె అంటున్నారు.
2012 నుంచి శ్యామ్.కె.నాయుడు –శ్రీసుధ మధ్య అనుసంబంధం ఉంది. 5 ఏళ్లు సహజీవనం చేసి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని గతంలో పలు ఇంటర్య్వూల్లో శ్రీసుధ పేర్కొన్నారు. తన వల్లే అప్పుల పాలయ్యానని ఆమె వాపోయారు. దాదాపు మూడేళ్లగా వీరిద్దపై కేసు నడుస్తోంది. డబ్బు ఆశ చూపి తెగతెంపులు చేసే ప్రయత్నం కూడా చేశారని, శ్యామ్.కె నాయుడు భార్య రెండుసార్లు తనపై దాడి చేశారని సుధ గతంలో పేర్కొన్నారు.

