మరో కథతో.. శ్రీనువైట్ల సిద్ధం

ABN , First Publish Date - 2022-09-26T06:30:14+05:30 IST

‘ఆనందం’, ‘ఢీ’, ‘రెడీ’, ‘వెంకీ’, ‘దుబాయ్‌ శీను’, ‘దూకుడు’.... ఇలా హిలేరియస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అందించారు శ్రీనువైట్ల....

మరో కథతో.. శ్రీనువైట్ల సిద్ధం

‘ఆనందం’, ‘ఢీ’, ‘రెడీ’, ‘వెంకీ’, ‘దుబాయ్‌ శీను’, ‘దూకుడు’.... ఇలా హిలేరియస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అందించారు శ్రీనువైట్ల. ఆయన సినిమా అంటే అన్ని రకాల మసాలాలు ఉంటాయి. వినోదం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఆయన సృష్టించిన పాత్రలు ఇప్పటికీ నవ్విస్తూనే ఉంటాయి. వాటి చుట్టూ ఎన్నో మీమ్స్‌ కూడా. అయితే కొన్నేళ్లుగా శ్రీనుకి విజయాలు లేవు. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా కొడుతున్నాయి. ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ తరవాత ఆయన ప్రాజెక్టు ఏదీ పట్టాల్కెలేదు. ‘ఢీ’కి సీక్వెల్‌ తీద్దామనుకొన్నారు కానీ, ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కి రాలేదు. అయితే ఇప్పుడు శ్రీనువైట్ల ఓ కథ తయారు చేసుకొన్నార్ట. ఆయన శైలిలోనే.. సరదాగా సాగిపోయే కథ సిద్ధమైందని తెలుస్తోంది. ప్రస్తుతం హీరో కోసం అన్వేషిస్తున్నారు. హీరో దొరగ్గానే.. ఈ సినిమా పట్టాలెక్కేస్తుంది. మరోవైపు శ్రీనువైట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించిన రచయిత గోపీ మోహన్‌ కొంత గ్యాప్‌ తరవాత ఇప్పుడు శ్రీనువైట్లతో మళ్లీ పనిచేయడానికి చేతులు కలిపినట్టు తెలుస్తోంది. త్వరలోనే శ్రీనువైట్ల కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి. 


Updated Date - 2022-09-26T06:30:14+05:30 IST