Srinidhi Shetty: ఇక అవకాశాలు వచ్చేది కష్టమేనా..?

ABN , First Publish Date - 2022-09-01T19:27:00+05:30 IST

శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కెరీర్ ఇప్పుడు డైలమాలో పడిందా..? అంటే తాజాగా వచ్చిన కోబ్రా (Cobra) సినిమా ఫలితంతో అదే మాట వినిపిస్తోంది. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి.

Srinidhi Shetty: ఇక అవకాశాలు వచ్చేది కష్టమేనా..?

శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కెరీర్ ఇప్పుడు డైలమాలో పడిందా..? అంటే తాజాగా వచ్చిన కోబ్రా (Cobra) సినిమా ఫలితంతో అదే మాట వినిపిస్తోంది. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. 2018లో కేజీఎఫ్ పార్ట్ 1 భారీ హిట్ సాధించడంతో వరుసగా క్రేజీ ఆఫర్స్ వచ్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, తన మొదటి సినిమా ఇంత భారీ హిట్ అయిందనే ఉద్దేశంతో రెమ్యునరేషన్ బాగా డిమాండ్ చేసిందట.


దాంతో చేతివరకు వచ్చిన చాలా అవకాశాలు జారిపోయాయని ప్రచారం జరిగింది. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు గానీ, మళ్ళీ కేజీఎఫ్ సీక్వెల్ మూవీలో కనిపించింది తప్ప మరే మూవీలోనూ కనిపించలేదు. కేజీఎఫ్ సిరీస్ అమ్మడికి మంచి క్రేజ్ తీసుకొచ్చినా ఒక్క తమిళ సినిమా తప్ప తెలుగులో గానీ, మరో భాషలోగానీ ఛాన్స్ దక్కలేదు. అయితే, చియాన్ విక్రమ్ (Vikram) హీరోగా నటించిన కోబ్రా శ్రీనిధి శెట్టి కెరీర్‌కి బాగా ప్లస్ అవుతుందని భావించింది.


కానీ, ఇటీవల భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫ్లాప్ టాక్ దగ్గర ఆగిపోయింది. దాంతో ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీనిధి శెట్టి పరిస్థితి ఇప్పుడేంటో..? అని మాట్లాడుకుంటున్నారు. కొత్తగా కమిటైన ప్రాజెక్ట్స్ గురించి కూడా ఎలాంటి అప్‌డేట్స్. ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో తెరకెక్కుతున్న సలార్ (Salaar) మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి శ్రీనిధి కెరీర్ ప్రస్తుతానికైతే డైలమాలో ఉన్నట్టే అనుకోవచ్చు.

Updated Date - 2022-09-01T19:27:00+05:30 IST