Pushpa the Rise : బన్నీకి బాలీవుడ్ క్రేజీ హీరో డబ్బింగ్

ABN , First Publish Date - 2021-12-08T22:18:51+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్’. రెండు భాగాలు రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ .. ఈ నెల 17న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమాతో బన్నీ తొలిసారిగా బాలీవుడ్ మార్కెట్ ను కొల్లగొట్టడానికి చూస్తున్నాడు. ఏఏ సినిమాస్ సంస్థ ఈ సినిమాను హిందీలో విడుదల చేస్తోంది. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ ట్రైలర్ .. బాలీవుడ్ లోనూ ప్రకంపనలు సృష్టించింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ వెర్షన్ కోసం బన్నీకి క్రేజీ హీరో శ్రేయస్ తల్పడే డబ్బింగ్ చెప్పడం విశేషమని చెప్పాలి.

Pushpa the Rise : బన్నీకి బాలీవుడ్ క్రేజీ హీరో డబ్బింగ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్’. రెండు భాగాలు రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ .. ఈ నెల 17న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమాతో బన్నీ తొలిసారిగా బాలీవుడ్ మార్కెట్ ను కొల్లగొట్టడానికి చూస్తున్నాడు. ఏఏ సినిమాస్ సంస్థ ఈ సినిమాను హిందీలో విడుదల చేస్తోంది. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ ట్రైలర్ .. బాలీవుడ్ లోనూ ప్రకంపనలు సృష్టించింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ వెర్షన్ కోసం బన్నీకి క్రేజీ హీరో శ్రేయస్ తల్పడే డబ్బింగ్ చెప్పడం విశేషమని చెప్పాలి. రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ తో కాకుండా.. పేరున్న వ్యక్తితో డబ్బింగ్ చెప్పించనుండడం ఈ సినిమాకి ప్లస్ అవుతోంది. 


ఇటీవల ‘పుష్ప’ హిందీ ట్రైలర్ ను లాంచ్ అయిన సందర్భంగా స్వయంగా శ్రేయస్ తల్పడే నే ఈ విషయాన్ని వెల్లడించారు. ఇండియాలోనే మోస్ట్ పవర్ ఫుల్ అండ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు డబ్బింగ్ చెప్పినందుకు తనకి చాలా గర్వంగా ఉందని చెప్పారు. ఇంతకు ముందు లయన్ కింగ్ హిందీ వెర్షన్ కు డబ్బింగ్ చెప్పిన శ్రేయస్ .. తెలుగు స్టార్ కు డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. ఇప్పటికే యూట్యూబ్ లో డబ్బింగ్ సినిమాలతో బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న బన్నీ.. .‘పుష్ప’  హిందీ వెర్షన్ తో బాలీవుడ్ లో  ఏరేంజ్ లో సక్సెస్ సొంతం చేసుకుంటాడో చూడాలి. 

Updated Date - 2021-12-08T22:18:51+05:30 IST