వెంకటేశ్‌ సలహాలు తీసుకుంటున్నా!

ABN , First Publish Date - 2021-08-19T06:34:27+05:30 IST

‘‘నేను వెంకటేశ్‌గారి వీరాభిమానిని. నా అంతట నేను ఆయన్ను కలవడం కంటే, ‘బాగా చేశావ్‌’ అని ఆయనే పిలిచి మాట్లాడితే బావుంటుందని ఓ చిన్న టార్గెట్‌ పెట్టుకున్నా...

వెంకటేశ్‌ సలహాలు తీసుకుంటున్నా!

‘‘నేను వెంకటేశ్‌గారి వీరాభిమానిని. నా అంతట నేను ఆయన్ను కలవడం కంటే, ‘బాగా చేశావ్‌’ అని ఆయనే పిలిచి మాట్లాడితే బావుంటుందని ఓ చిన్న టార్గెట్‌ పెట్టుకున్నా. ‘నీదీ నాదీ ఒకే కథ’ చూసి పిలిచి మాట్లాడారు. అప్పట్నుంచీ ఏదైనా సందేహాలుంటే ఆయన సలహాలు తీసుకుంటున్నా. అవి నాకెంతో ఉపయోగపడుతున్నాయి. ఈమధ్య మాస్‌లో వైవిధ్యంగా ప్రయత్నించమని సలహా ఇచ్చారు’’ అని శ్రీవిష్ణు అన్నారు. ఆయన తాజా చిత్రం ‘రాజ రాజ చోర’ గురువారం విడుదలవుతోంది. శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘‘ఇందులో కొంటె దొంగగా కనిపిస్తా. దర్శకుడు హసిత్‌ గోలి కథను కొత్తగా చెప్పాడు. విభిన్నంగా ప్రయత్నించాం. సినిమా చూశాక... వినోదం, భావోద్వేగాలతో కుటుంబమంతా చూసేలా ఉందనిపించింది. వెంకటేశ్‌గారి చిత్రాలతో పోల్చకూడదు గానీ, అలా ఉండటంతో ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌లో ఆ విధంగా మాట్లాడాను. కథ గురించి ఎక్కువ చెప్పకూడదు గానీ... అబద్ధాలను నిజమని నమ్మేలా చెప్పే కొంటె దొంగ అందర్నీ నవ్విస్తాడు’’ అని చెప్పారు. ప్రస్తుతం ‘అర్జున ఫాల్గుణ’, ‘భళా తందనానా’తో పాటు ఓ ఫిక్షనల్‌ పోలీస్‌ బయోపిక్‌ చేస్తున్నానని తెలిపారు.

Updated Date - 2021-08-19T06:34:27+05:30 IST