దసరా ట్రీట్: ‘జీ 5’లో ‘రాజ రాజ చోర’

ABN , First Publish Date - 2021-10-07T23:50:30+05:30 IST

ఇటీవలే ‘అలాంటి సిత్రాలు’ను డైరెక్ట్ డిజిటల్ చేసిన ‘జీ 5’ ఓటీటీ వేదిక... ఇప్పుడు విజయదశమి కానుకగా వినోదాల విందు ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రామిసింగ్ స్టార్ శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. కరోనా సెకండ్ వేవ్

దసరా ట్రీట్: ‘జీ 5’లో ‘రాజ రాజ చోర’

ఇటీవలే ‘అలాంటి సిత్రాలు’ను డైరెక్ట్ డిజిటల్ చేసిన ‘జీ 5’ ఓటీటీ వేదిక... ఇప్పుడు విజయదశమి కానుకగా వినోదాల విందు ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రామిసింగ్ స్టార్ శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. కరోనా సెకండ్ వేవ్ తర్వాత.. ఆగస్టు 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నవ్వించడంతో పాటు మంచి సందేశం ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఫస్ట్ సక్సెస్‌ని టాలీవుడ్‌కి ఇచ్చిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 8న ‘జీ 5’ ఓటీటీలో విడుదలకానుంది.


హసిత్ గోలి దర్శకుడిగా పరిచయమైన ‘రాజ రాజ చోర’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. దొంగగా శ్రీ విష్ణు... అతని భార్యగా సునైన, ప్రేయసిగా మేఘా ఆకాష్, ఇతర పాత్రల్లో రవి బాబు, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, గంగవ్వ, తనికెళ్ల భరణి తదితరుల నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. వివేక్ సాగర్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దసరాకు ఓటీటీలో ఇంటిల్లిపాది కలిసి చూస్తూ నవ్వుకునే సినిమా ‘రాజ రాజ చోర’ అవుతుందని ‘జీ 5’ ప్రకటించింది. కాగా, విజయదశమి తర్వాత.. ఈ నెల 22న ‘హెడ్స్ అండ్ టేల్స్’ సినిమాను ‘జీ 5’ విడుదల చేయనుంది.

Updated Date - 2021-10-07T23:50:30+05:30 IST