మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో చిరంజీవి, రామ్‌చరణ్ నక్సలైట్స్‌గా కనిపించబోతున్నారు. కథ ప్రకారం ఈ సినిమాలో ఓ ఎమోషనల్ సాంగ్ ఉండబోతుంది. ఈ సాంగ్‌లో అభ్యుదయ విప్లవ కవి శ్రీశ్రీ పంక్తులు వినిపిస్తాయని సమాచారం. ఇప్పటి వరకు చిరంజీవి రుద్రవీణ, ఠాగూర్ సినిమాల్లో శ్రీశ్రీ రాసిన ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిథనొక్కటి ఆహుతిచ్చాను’ అనే లైన్‌ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు మరోసారి చిరు తన ‘ఆచార్య’ సినిమా కోసం శ్రీశ్రీ లైన్స్‌ను వాడుకోబోతున్నారట. మరి ఆ పంక్తులు ఎలాంటి సందర్భంలో వస్తుందనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.