‘ఆహా’లో ‘ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం’..రిలీజ్ డేట్

ABN , First Publish Date - 2021-08-24T01:04:09+05:30 IST

కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గు ముఖం పట్టిన తర్వాత థియేటర్స్‌లో విడుదలైన చిత్రాల్లో ఎస్.ఆర్.కళ్యాణ మండపం ఒకటి. ఆగస్ట్ 6న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఆహాలో ...

‘ఆహా’లో ‘ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం’..రిలీజ్ డేట్

కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గు ముఖం పట్టిన తర్వాత థియేటర్స్‌లో విడుదలైన చిత్రాల్లో ఎస్.ఆర్.కళ్యాణ మండపం ఒకటి. ఆగస్ట్ 6న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఆహాలో ఆగస్ట్ 28న విడుదలవుతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా హీరో రో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత, మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో మా ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. మా నమ్మకాన్ని తెలుగు ఆడియెన్స్ నిజం చేసి ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ ను అపూర్వంగా ఆదరించారు. థియేటర్స్‌లో మా సినిమాను ఆద‌రించిన విధంగానే ఈ ఆగ‌స్ట్ 28న ఆహాలో విడుద‌ల‌వుతున్న మా సినిమా ఆద‌రించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న ఆహా లిస్టులో మా ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చేయ‌డం ఆనందంగా ఉంది’’ అన్నారు. 

Updated Date - 2021-08-24T01:04:09+05:30 IST