విష్ణు మంచు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నటీనటులతో పాటు సాంకేతిక వర్గం విషయంలో కూడా మంచు విష్ణు కాంప్రమైజ్ కావడం లేదు. ముఖ్యంగా కొరియోగ్రాఫర్స్ విషయంలో కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే చిత్రంలోని ఓ పాటను ప్రభుదేవా నృత్య దర్శకత్వం వహించగా, మరో పాటకు గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఎంగేజ్మెంట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాట సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఇందులో విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ పాల్గొనగా, కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కూడా కాలు కదపడం విశేషం. డాక్టర్ మంచు మోహన్‌బాబు ఆశీస్సులతో అవరామ్ భక్త మంచు సమర్పణలో ‘జిన్నా’ చిత్రం రూపుదిద్దుకుంటోంది.