థ్రిల్లర్ షోలో ఫోన్ నంబర్... ఆమెకు వేలాదిగా ప్రాంక్ కాల్స్!

ABN , First Publish Date - 2021-10-09T01:43:13+05:30 IST

స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకొచ్చింది ‘స్క్విడ్ గేమ్’ షో. సూపర్ హిట్టైన ఇందులో కంటెస్టెంట్స్ భారీ మొత్తంలో దక్కే ప్రైజ్ మనీ కోసం ‘చచ్చేదాకా’ తెగించి గేమ్ ఆడుతుంటారు. అయితే, ఇదంతా నిజం కాదు. కేవలం ఫిక్షన్ మాత్రమే. అంతా ఒట్టిదే అయినా సౌత్ కొరియాలో ఒక్క మహిళకి మాత్రం నిజంగా కష్టాలు వచ్చిపడ్డాయి. ఆమె ‘స్క్విడ్ గేమ్’ కారణంగా తన ఫోన్ వాడలేక, ఊరుకోలేక సతమతం అవుతోంది.

థ్రిల్లర్ షోలో ఫోన్ నంబర్... ఆమెకు వేలాదిగా ప్రాంక్ కాల్స్!

స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకొచ్చింది ‘స్క్విడ్ గేమ్’ షో. సూపర్ హిట్టైన ఇందులో కంటెస్టెంట్స్ భారీ మొత్తంలో దక్కే ప్రైజ్ మనీ కోసం ‘చచ్చేదాకా’ తెగించి గేమ్ ఆడుతుంటారు. అయితే, ఇదంతా నిజం కాదు. కేవలం ఫిక్షన్ మాత్రమే. అంతా ఒట్టిదే అయినా సౌత్ కొరియాలో ఒక్క మహిళకి మాత్రం నిజంగా కష్టాలు వచ్చిపడ్డాయి. ఆమె ‘స్క్విడ్ గేమ్’ కారణంగా తన ఫోన్ వాడలేక, ఊరుకోలేక సతమతం అవుతోంది. 


‘స్క్విడ్ గేమ్’ అనే నెట్‌ఫ్లిక్స్ థ్రిల్లర్ షోలో ఓ ఫోన్ నంబర్ తెరపై చూపించారు. అదే కథలోని కీలక మలుపుకి కారణం కూడా. దాంతో జనం దృష్టి సదరు మొబైల్ నంబర్‌పై బాగా పడింది. వెంటనే దానికి వేలాదిగా కాల్స్ చేయటం మొదలు పెట్టారు. మెసేజెస్ కూడా బోలెడు వెళ్లాయి. ఇంతకీ, ఆ నంబర్ ఎవరిది? సౌత్ కొరియాలో ఓ సామాన్యురాలిది. ఆమె సాదాసీదా జీవితం కాస్తా ‘స్క్విడ్ గేమ్’ కారణంగా పెద్ద వార్తగా మారింది. ఆమెకు ఆ నంబర్ ప్రధానమైంది కావటం, అదే నంబర్‌తో ఆమెకు వృత్తి రిత్యా అనేక మంది క్లైంట్స్‌తో కాంటాక్ట్స్ ఉండటం... సమస్యని మరింత జటిలం చేసింది. నంబర్ తీసేయలేక, ఉంచుకోలేక తాను ఇబ్బంది పడుతోంది. 


నెట్‌ఫ్లిక్స్ కోసం ‘స్క్విడ్ గేమ్’ షోను రూపొందించిన దక్షిణ కొరియా నిర్మాణ సంస్థ భారీ మొత్తంలో డబ్బు ఇస్తామన్నా ఆమె తన నంబర్ వదులుకోటానికి సిద్ధపడక పోవటంతో ఇప్పుడు ఇతర మార్గాల్ని అన్వేషిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ త్వరలో ఫోన్ నంబర్ కనిపించే సీన్స్ అన్ని ఎడిట్ చేయబోతోంది. సదరు మహిళ నంబర్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతోంది. అప్పటికైనా ఆమెకు తలనొప్పిగా మారిన అవాంఛిత కాల్స్ అండ్ మెసేజెస్ ఆగుతాయో లేదో చూడాలి మరి... 

Updated Date - 2021-10-09T01:43:13+05:30 IST