ఇండియన్ క్రికెట్ కెప్టెన్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ రీసెంట్గా ఓ పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రసవం తర్వాత హార్మోన్లలో హెచ్చు తగ్గులుంటాయి. దీని వల్ల మహిళలు జట్టు రాలిపోతుంది. అలాంటి సమస్య అనుష్క శర్మకి కూడా వచ్చింది. అయితే ఈ సమస్య పరిష్కారానికి అనుష్క డాక్టర్స్‌ను సంప్రదించలేదు. మరో హీరోయిన్ సోనమ్ కపూర్ చెప్పిన సలహాను పాటించడం వల్ల సమస్య నుంచి బయటపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఇన్‌స్టాలో అనుష్క కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించింది. తన కురుల సమస్యను తీర్చిన జార్జ్ నార్త్ వుడ్ అనే హెయిర్ సెలూన్‌కి, దాన్ని పరిచయం చేసిన సోనమ్ కపూర్‌కి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పింది అనుష్క శర్మ.