‘F3’.. నా కెరీర్‪లో ఇదే మొదటిసారి: సోనాల్ చౌహాన్

Twitter IconWatsapp IconFacebook Icon
F3.. నా కెరీర్‪లో ఇదే మొదటిసారి: సోనాల్ చౌహాన్

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) హీరోలుగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఫన్ ఫ్రాంచైజీగా రాబోతోన్న చిత్రం ‘ఎఫ్3’ (F3). ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) పతాకంపై దిల్ రాజు (Dil Raju) సమర్పణలో శిరీష్ (Sirish) నిర్మిస్తున్నారు. వెంకటేష్‪కు జోడిగా తమన్నా (Tamannah), వరుణ్ తేజ్‪కు జోడిగా మెహ్రీన్ (Mehreen) నటించిన ఈ చిత్రంలో మరో హీరోయిన్ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) ఓ కీలక పాత్రలో నటించింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‪టైనర్‪గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతోంది. దీంతో చిత్రయూనిట్ ప్రొమోషన్ కార్యక్రమాలను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన అందాల భామ సోనాల్ చౌహాన్.. మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆమె చెప్పిన ‘ఎఫ్ 3’ చిత్ర విశేషాలివే..


‘ఎఫ్ 3’ ప్రాజెక్ట్‪లో అవకాశం ఎలా వచ్చింది?

ఈ ప్రాజెక్ట్‪లోకి రావడం వెనుక చాలా ఆసక్తికరమైన కథ వుంది. ‘లెజెండ్’ సినిమా జరుగుతున్నప్పుడే దర్శకుడు అనిల్ రావిపూడిగారితో పరిచయం. రామోజీ ఫిల్మ్ సిటీలో లెజెండ్  షూటింగ్ జరుగుతున్న సమయంలో అనిల్ గారు వేరే సినిమా షూటింగ్ చేస్తున్నారు. అదే సమయంలో మాట్లాడుకున్నాం.  కలసి వర్క్ చేయాలని అనుకున్నాం. ఐతే చాలా ఏళ్ల తర్వాత ఆయన నుండి ఫోన్ వచ్చింది. ‘ఎఫ్3’ అనే సినిమా చేస్తున్నాను. ఓ పాత్ర కోసం మిమ్మల్ని అనుకుంటున్నాను అని అన్నారు. మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. అనిల్ గారు కామెడీ కింగ్. అప్పటికే ఎఫ్ 2 సినిమా చూశాను. హిలేరియస్ మూవీ అది. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్ 3లో వుంటుంది.


‘ఎఫ్ 3’ ట్రైలర్‪లో కూడా మీ పాత్రపై క్లారిటీ ఇవ్వలేదు.. ఇంతకీ ఎఫ్3లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

ఈ సినిమాలో నేను చేస్తున్న పాత్ర చాలా సర్‪ప్రైజింగ్‪గా ఉంటుంది. ట్రైలర్‪లో కూడా సీక్రెట్‪గా దాచిపెట్టాం. నా పాత్రలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్‪టైన్ ఫీలౌతారు. ఇప్పటికైతే నా పాత్ర గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.


మీ పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటుందా?

‘ఎఫ్ 2’ కంటే ‘ఎఫ్ 3’లో భారీ తారాగణం వుంది. అన్ని పాత్రలకు కథలో ప్రాధాన్యత వుంది. నా పాత్ర వరకూ వస్తే .. కథలో కీలకమైన పాత్రే. పైగా ఫుల్‪లెంత్ కామెడీ సినిమా చేయడం నా కెరీర్‪లో ఇదే మొదటిసారి. ఎఫ్ 3 లాంటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ చేయడం ఒక ఛాలెంజింగ్‪గా అనిపించింది.  ఎందుకంటే కామెడీ చేయడం అంత తేలిక కాదు.  


మీ కెరీర్‪లో ఇదే ఫస్ట్ కామెడీ ఎంటర్‪టైనర్ కదా.. దీని కోసం ప్రత్యేకంగా హోం వర్క్ ఏమైనా చేశారా?

కామెడీ ఎంటర్ టైనర్ చేయడం నాకు కొత్త. చాలా టెన్షన్ పడ్డాను. ‘ఎలా ప్రిపేర్ అవ్వాలి ? ఏవైనా సినిమాలు చూడాలా ?’ అని దర్శకుడు అనిల్ రావిపూడి గారిని అడిగాను. ఆయన సూపర్ కూల్. ఏమీ అలోచించకుండా నేరుగా షూటింగ్‪కి వచ్చేయమని చెప్పారు. అనిల్‪గారితో వర్క్ చేయడం ఆర్టిస్ట్‪కి చాలా ఈజీ. ఆయనే నటించి చూపిస్తారు. ఆయనకి చాలా క్లారిటీ వుంటుంది. ఆర్టిస్ట్ నుండి పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో నేర్పరి. ఆయన చెప్పినట్లు చేస్తే చాలు మన పని తేలికైపోతుంది.

వెంకటేష్, వరుణ్ తేజ్ వంటి స్టార్ హీరోలతో పని చేయడం ఎలా అనిపించింది?

వెంకటేష్‪గారితో కలసి పని చేయడం ఒక గౌరవం. ఆయన గొప్ప నటుడే కాదు.. గొప్ప మనిషి. సెట్స్‪లో అందరితో కలసి మాట్లాడతారు. సహనటులు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేస్తారు. అలాగే ఆయన ఎప్పుడూ నిర్మాతల పక్షం ఆలోచిస్తుంటారు. సమయం వృధా చేయడం ఆయనకి నచ్చదు. ప్రొడక్షన్ వైపు నుంచి ఎక్కువ ఆలోచిస్తారు. వెంకటేష్ గారి నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వరుణ్ తేజ్ చాలా పాజిటివ్‪గా ఉంటారు. చాలా ఫ్రెండ్లీ పర్సన్. వరుణ్ తేజ్ వంటి స్టార్‪తో వర్క్ చేయడం కూడా ఆనందాన్నిచ్చింది.


తమన్నా, మెహ్రీన్‪లతో కలిసి నటించడంపై..?

తమన్నా, మెహ్రీన్‪లతో కలసి పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్‪పీరియన్స్. ఈ సినిమా తర్వాత మేము మంచి స్నేహితులయ్యాం.


దర్శకుడు అనిల్ రావిపూడిగారితో పని చేయడం ఎలా అనిపించింది?

‘లెజండ్’ (Legend) సినిమా సమయంలో ఆయన్ని కలసినప్పుడు చాలా పాజిటివ్, నైస్ పర్సన్ అనిపించారు. ఎఫ్ 3లో కలిసి వర్క్ చేసిన తర్వాత ఆయనపై గౌరవం ఇంకా పెరిగింది. అనిల్‪గారు గొప్ప కథకుడు. చాలా పాజిటివ్‪గా వుంటారు. ఆయన పాజిటివిటీనే తెరపై కనిపిస్తుంటుంది. ఇంతమంది స్టార్ కాస్ట్‪తో సినిమా చేస్తున్నపుడు.. కొంచెం కూడా ఒత్తిడి తీసుకోరు. పైగా సెట్స్‪లో చాలా సరదాగా జోకులు వేస్తుంటారు. కష్టాన్ని కూడా కామెడీగా మార్చగలరు. ఆయనకి గ్రేట్ సెన్సాఫ్ హ్యుమర్ వుంది.


ఎఫ్ 3 లో మీ మెమొరబుల్ మూమెంట్?

ఫస్ట్ సీన్ వెంకటేష్ గారితో చేయాలి. చాలా కంగారు పడ్డా. ఎలా వుంటుందో అనుకున్నా. ఐతే ఆ సీన్ చాలా కూల్‪గా జరిగింది. బెస్ట్ మూమెంట్ అది.


దిల్ రాజుగారి నిర్మాణంలో పని చేయడం ఎలా అనిపించింది?

దిల్ రాజు గారు, శిరీష్ గారు గ్రేట్ ప్రొడ్యూసర్స్. వారి నిర్మాణంలో పని చేయాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. ఎఫ్ 3తో ఆ కోరిక తీరింది. సినిమా పట్ల ఇష్టం, అంకితభావం వున్న నిర్మాతలు. సినిమాకి సంబంధించిన ప్రతి అంశాన్ని దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‪లో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను.


మీరు చాలా భాషల్లో నటిస్తున్నారు కదా.. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రత్యేకత ఏమిటి?

తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు, దర్శకులు చాలా క్లారిటీగా వుంటారు. ప్రేక్షకుడు కోరుకునే వినోదం అందించడానికి తపన పడతారు. ప్రేక్షకుడిని గౌరవిస్తారు. ఈ క్రమంలోనే గొప్ప సినిమాలు వస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఇప్పుడు దేశం అంతా గొప్పగా మాట్లాడుతుంది.


ఈ సినిమా మీ కెరీర్‪కి గేమ్ ఛేంజర్  సినిమా అవుతుందని భావిస్తున్నారా?

ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం వుంది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్‪గా ఉండబోతుంది.


కొత్తగా చేస్తున్న సినిమాలు?

నాగార్జున (Nagarjuna)‪గారితో ‘ది ఘోస్ట్’ (The Ghost) సినిమా చేస్తున్నా. అందులో నాది ఫుల్ యాక్షన్ రోల్. ఇంకొన్ని చర్చలలో ఉన్నాయి.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.