అక్కినేని నాగార్జున లేటెస్ట్ చిత్రం ‘బంగార్రాజు’ సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే ఉత్సాహంతో నాగ్ తదుపరి చిత్రం ‘ది ఘోస్ట్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా కోసం వైవిధ్యమైన కథాంశాన్ని ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ‘గరుడవేగ’ తరహా ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ మూవీ ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. ఇందులో నాగ్ ‘రా’ ఏజెంట్ గా నటిస్తున్నారంటూ ఇదివరకే వార్తలొచ్చాయి. ఆయన కొలిగ్ గా నటించే కథానాయిక పాత్రలో ముందుగా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. అయితే ఆమె వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఆమె ప్లేస్ లో బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ను ఎంపిక చేశారని టాక్.
ఇంత వరకూ నాయిక కాంబినేషన్ సీన్స్ ను దర్శకుడు చిత్రీరించలేదు. మరో కథానాయికగా సెట్ అయ్యాకా ఆమెతో చేద్దామని ఆ సీన్స్ ను పక్కన పెట్టారు. తదుపరి షెడ్యూల్ లో నాయికానాయకుల సీన్స్ ఉండబోతున్నాయట. అందుకే హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ ను దర్శకుడు ఖాయం చేశాడట. ‘లెజెండ్, డిక్టేటర్, రూలర్, పండగచేస్కో’ లాంటి సినిమాల్లో మెరిసిన ఆమె.. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ చిత్రంలోనూ నటిస్తోంది. మరి ది ఘోస్ట్ లో ఆమె ఏ స్థాయిలో అందాలు ఆరబోస్తుందో చూడాలి.