‘‘పంది లాంటి ముఖం’’ అంటూ Aamir Khan కూతుర్ని ట్రోల్ చేసిన నెటిజన్! తరువాత ఏం జరిగిందంటే...

ABN , First Publish Date - 2022-01-29T23:11:38+05:30 IST

ఆమీర్ ఖాన్ కూతురు ఇరాకి కూడా సొషల్ మీడియా ట్రోలింగ్స్ కొత్తేమీ కాదు. తాజాగా ఆమెని ఓ నెటిజన్ తీవ్రంగా అవమానించాడు. తనకి వయసైపోయిందని, తనది పంది లాంటి ముఖమని కామెంట్ చేశాడు! ఇరా ఖాన్ ఆ ట్రోల్ గురించి పట్టించుకోలేదుగానీ బాలీవుడ్ సింగర్ సోనా మహాపాత్ర సీరియస్ అయింది. ఎందుకంటే...

‘‘పంది లాంటి ముఖం’’ అంటూ Aamir Khan కూతుర్ని ట్రోల్ చేసిన నెటిజన్! తరువాత ఏం జరిగిందంటే...

సొషల్ మీడియాలో సెలబ్రిటీలు మాట్లాడినా తంటాలే, మాట్లాడకున్నా తంటాలే. ఆమీర్ ఖాన్ కూతురు ఇరాకి కూడా సొషల్ మీడియా ట్రోలింగ్స్ కొత్తేమీ కాదు. తాజాగా ఆమెని ఓ నెటిజన్ తీవ్రంగా అవమానించాడు. తనకి వయసైపోయిందని, తనది పంది లాంటి ముఖమని కామెంట్ చేశాడు! ఇరా ఖాన్ ఆ ట్రోల్ గురించి పట్టించుకోలేదుగానీ బాలీవుడ్ సింగర్ సోనా మొహపాత్ర సీరియస్ అయింది. ఎందుకంటే, సదరు పోకిరి నెటిజన్ సోనా కామెంట్‌కి రిప్లైగా ఇరాని నానా మాటలు అంటూ బదులిచ్చాడు కాబట్టి... 


ఆమీర్ మొదటి భార్య రీనా దత్తా కూతురు ఇరా ఖాన్ గతంలో పలుమార్లు మెంటల్ హెల్త్, డిప్రెషన్ గురించి సొషల్ మీడియాలో మాట్లాడింది. ఆమెకు చాలా మంది మద్దతు పలికారు. అయితే, కొందరు తనని ట్రోల్ కూడా చేశారు. తాజాగా మరోసారి ఇరా మానసిక రుగ్మతల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో చర్చించింది. ఓ వీడియో అప్‌లోడ్ చేసింది. దానిపై స్పందించిన బీ-టౌన్ సింగర్ సోనా మొహపాత్ర ‘‘గుడియా, డాలీ’’ అంటూ కామెంట్ చేసింది. ఇరాని ‘బొమ్మలా ఉన్నావ్’ అంటూ ఆమె మెచ్చుకోవటం ఓ ఇన్‌స్టా యూజర్‌కి నచ్చలేదు. వెంటనే, సోనా కామెంట్‌కి కింద దారుణమైన కామెంట్లతో రెచ్చిపోయాడు.


‘‘సోనా మొహపాత్ర... ఆమె నీకు డాలీలా కనిపిస్తోందా... పిచ్చాదానా!’’ అన్నాడు ‘చందన్‌రామ్’ అనే నెటిజన్. అక్కడితో ఆగక ‘‘ఆమె కళ్ల కింద మరకలు చూడు... యవ్వనంలోనే ముసలిదైపోయింది. పంది లాంటి ముఖం తనది!’’ అని కూడా అన్నాడు. ఇరా ఖాన్‌ గురించి దారుణంగా మాట్లాడటంతో సోనా మొహపాత్ర రియాక్ట్ అవ్వక తప్పలేదు. ‘‘నీకు ఎలాంటి పని లేదు, నీ బతుకంతా ఓటమే. ఆ ఓడిపోయిన తాలూకూ జీవితంలోని విసుగునంతా ఇక్కడ విషం రూపంలో వెళ్లగక్కుతున్నావు. వెళ్లి ఏదైనా పని నేర్చుకుని, చేసుకో. ఇలా బతికేస్తూ నీ తల్లిదండ్రులకి అవమానంగా మారకు...’’ అంటూ సోనా ఘాటుగా సమాధానం ఇచ్చింది. 


ఇరా ఖాన్ వీడియోకి ఇన్‌‌స్టాగ్రామ్‌లో భారీగానే స్పందన లభించింది. చాలా మంది ఆమెకు మద్దతు పలికారు. అయితే, కొందరు ట్రోలర్స్ మాత్రం అదే పనిగా ఆమెని వ్యక్తిగతంగా దూషిస్తూ కామెంట్స్ సెక్షన్‌లో రచ్చ చేశారు.  

Updated Date - 2022-01-29T23:11:38+05:30 IST