ప్రియుడితో కొత్త సూపర్ మ్యాన్ లిప్ లాక్! డీసీ కామిక్స్‌లో రచ్చ...

ABN , First Publish Date - 2021-10-12T23:21:30+05:30 IST

ఒరిజినల్ సూపర్‌మ్యాన్ క్లార్క్ కెంట్, జర్నలిస్ట్ లూయిస్ లేన్ దంపతుల వారసుడు జాన్ కెంట్. అయితే, నవంబర్‌లో విడుదల కాబోయే లెటెస్ట్ డీసీ కామిక్ సిరీస్‌లో, సరికొత్త సూపర్‌మ్యాన్‌గా జూనియర్ కెంట్, పాఠకుల ముందుకు రాబోతున్నాడు. విషయం అంతే అయితే ఇంత సంచలనం అయ్యేదే కాదు.

ప్రియుడితో కొత్త సూపర్ మ్యాన్ లిప్ లాక్! డీసీ కామిక్స్‌లో రచ్చ...

ఒరిజినల్ సూపర్‌మ్యాన్ క్లార్క్ కెంట్, జర్నలిస్ట్ లూయిస్ లేన్ దంపతుల వారసుడు జాన్ కెంట్. అయితే, నవంబర్‌లో విడుదల కాబోయే లెటెస్ట్ డీసీ కామిక్ సిరీస్‌లో, సరికొత్త సూపర్‌మ్యాన్‌గా జూనియర్ కెంట్, పాఠకుల ముందుకు రాబోతున్నాడు. విషయం అంతే అయితే ఇంత సంచలనం అయ్యేదే కాదు. సూపర్‌మ్యాన్ మారటమే కాదు ఆయన వ్యవహారం కూడా ఈసారి అనూహ్యంగా మారనుంది. న్యూ సూపర్‌మ్యాన్‌కు ప్రియురాలు కాదు ప్రియుడు ఉంటాడట! అతడితో జాన్ కెంట్ లిప్ లాక్ చేస్తున్నట్టు కనిపిస్తోన్న షాకింగ్ పిక్ ఇప్పుడు సూపర్‌మ్యాన్ ఫ్యాన్స్‌లో సెన్సేషన్ అవుతోంది... 


అమెరికాలో అక్టోబర్ 11వ తేదీని ఏటా ‘నేషనల్ కమింగ్ ఔట్ డే’గా పాటిస్తారు. ఆ రోజు చాలా మంది సామాన్యులు, ప్రముఖులు తాము గే, లెస్బియన్, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ అంటూ రహస్యాల్ని బయటపెడుతుంటారు. ఆ క్రమంలోనే కొత్త సూపర్‌మ్యాన్ కూడా రిపోర్టర్ జే నకమూరాను కిస్ చేస్తూ జనం ముందుకొచ్చాడు. వారి ఫోటోను చూసిన సూపర్‌మ్యాన్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో షాక్ అయ్యారనే చెప్పాలి. 


‘‘ఇది గిమ్మిక్ కాదు. సూపర్‌మ్యాన్ తనని తాను కనుగొంటాడు. సూపర్‌మ్యాన్‌గా మారతాడు. ఆ తరువాత అతను బైసెక్సువల్‌గా జనం ముందుకు వస్తాడు!’’ సూపర్‌మ్యాన్ రచయిత టామ్ టైలర్ వివరించారు. చూడాలి మరి, వచ్చే నెల విడుదల కానున్న ‘సూపర్‌మ్యాన్ : సన్ ఆఫ్ కాల్-ఎల్’ డీసీ కామిక్స్ వర్షన్‌ రీడర్స్‌ని ఎంత ఎం‘గే’జ్ చేస్తుందో! 

Updated Date - 2021-10-12T23:21:30+05:30 IST