తండ్రి సముద్రఖని బాటలోనే తనయుడు కూడా..

ABN , First Publish Date - 2022-01-06T03:35:35+05:30 IST

దర్శకత్వం నుంచి నటన వైపు మొగ్గు చూపిన సముద్రఖని ప్రస్తుతం కోలీవుడ్‌, టాలీవుడ్‌‌లో అత్యంత బిజీ నటుడిగా కెరీర్‌ కొనసాగిస్తున్నారు. ఆయన తనయుడు హరి విఘ్నేశ్వరన్‌ కూడా తండ్రి బాటలోనే

తండ్రి సముద్రఖని బాటలోనే తనయుడు కూడా..

దర్శకత్వం నుంచి నటన వైపు మొగ్గు చూపిన సముద్రఖని ప్రస్తుతం కోలీవుడ్‌, టాలీవుడ్‌‌లో అత్యంత బిజీ నటుడిగా కెరీర్‌ కొనసాగిస్తున్నారు. ఆయన తనయుడు హరి విఘ్నేశ్వరన్‌ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ఎంతో ప్రతిభ, నైపుణ్యం కలిగిన హరి విఘ్నేశ్వరన్‌... తాజాగా ఓ షార్ట్‌ ఫిల్మ్‌ రూపొందించారు. జీవితంలో ముందుకు రావాలని పరితపించే యువత ఏ విధంగా మోసపోతున్నారనే అంశంతో ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించాడు. దీన్ని యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. 


ఇదిలా వుంటే, సముద్రఖని చివరగా ‘వినోదయ సిద్ధం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. కోలీవుడ్‌లో మంచి దర్శకుడుగా గుర్తింపుపొందిన సముద్రఖని... తన కుమారుడి అభిరుచి మేరకు దర్శకత్వ విభాగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. 

Updated Date - 2022-01-06T03:35:35+05:30 IST