కొన్ని కథలు ఓటీటీలోనే చెప్పాలి!

ABN , First Publish Date - 2022-01-21T10:03:58+05:30 IST

‘‘ఓటీటీ అంటే ఏమిటి? ఈ వేదికని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? అనే విషయాలపై ఈతరం ఇంకా క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది..

కొన్ని కథలు ఓటీటీలోనే చెప్పాలి!

‘‘ఓటీటీ అంటే ఏమిటి? ఈ వేదికని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? అనే విషయాలపై ఈతరం ఇంకా క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ‘లూజర్‌ 2’తో తెలుగు ఓటీటీ రంగంలో మరో విజయం చేరడం ఖాయం’’ అన్నారు సుప్రియ యార్లగడ్డ. అన్నపూర్ణ స్డూడియోస్‌, స్పెక్ట్రమ్‌ మీడియా నెట్‌ వర్క్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్‌, కల్పితా గణేష్‌, శశాంక్‌, పావనీ ప్రఽధాన పాత్రలు పోషించారు. అభిలాష్‌ రెడ్డి, శ్రవణ్‌ మాదాల దర్శకత్వం వహించారు. ఈనెల 21 నుంచిజీ 5లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా సుప్రియ మాట్లాడుతూ ‘‘కొన్ని కథలు ఓటీటీల్లోనే చెప్పగలం. పెద్ద కథలకు ఓటీటీ ఓ చక్కటి వేదిక. ‘లూజర్‌ 2’ అలాంటి కథే. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు మాకు దొరికారు. వాళ్ల పనితనం తెరపై కనిపిస్తుంద’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘గెలుపు ఓటములు ఏ రంగంలో అయినా ఉంటాయి. కానీ స్పోర్ట్స్‌తోనే ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్‌ అవుతారు. అందుకే మేం క్రీడా నేపథ్యాన్ని ఎంచుకున్నామ’’న్నారు. ‘‘కంటెంట్‌   ఉన్న సబ్జెక్ట్‌ ఇది. అందుకే ‘లూజర్‌’ సిరీస్‌ పెద్ద హిట్టయ్యింది. సీజన్‌ 2 కూడా ఘన విజయంసాధిస్తుందన్న నమ్మకం ఉంద’’న్నారు ప్రియదర్శి.  


Updated Date - 2022-01-21T10:03:58+05:30 IST