సాఫ్ట్‌వేర్‌ వినోదం

ABN , First Publish Date - 2022-06-13T05:57:15+05:30 IST

శ్రీరాం, భావనా, ఆర్యమాన్‌, మహబూబ్‌బాషా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ బ్లూస్‌’. ఈ నెల 24న విడుదలవుతోంది...

సాఫ్ట్‌వేర్‌ వినోదం

శ్రీరాం, భావనా, ఆర్యమాన్‌, మహబూబ్‌బాషా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ బ్లూస్‌’. ఈ నెల 24న విడుదలవుతోంది. ఉమాశంకర్‌ దర్శకుడు. సిల్వర్‌ పిక్సెల్‌ మీడియా వర్క్స్‌ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం రిలీజ్‌ ట్రైలర్‌ను దర్శకుడు క్రిష్‌ విడుదల చేశారు. సాఫ్ట్‌వేర్‌ నేపథ్యంలో వినోదాత్మకంగా తెరకెక్కించామని చిత్రదర్శకుడు చెప్పారు. ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తే చిత్రమిదని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్‌ ఆనంద్‌. సినిమాటోగ్రఫీ: నిమ్మ గోపి.

Updated Date - 2022-06-13T05:57:15+05:30 IST