ఎస్‌.కె హాస్యం

ABN , First Publish Date - 2021-07-16T08:55:57+05:30 IST

చిరంజీవి కుంచల్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎస్‌. కె’. సీనియర్‌ నటుడు పృథ్వీరాజ్‌ కుమార్తె శ్రీలు కథానాయికగా పరిచయమవుతున్నారు...

ఎస్‌.కె హాస్యం

చిరంజీవి కుంచల్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎస్‌. కె’. సీనియర్‌ నటుడు పృథ్వీరాజ్‌ కుమార్తె శ్రీలు కథానాయికగా పరిచయమవుతున్నారు. సెజల్‌ మరో హీరోయిన్‌. గురువారం పూజా కార్యక్రమంతో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. నిర్మాత సర్దార్‌ సుర్జీత్‌ సింగ్‌ స్ర్కిప్ట్‌ను అందజేశారు. ‘‘నెల రోజుల పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేస్తాం. ఆకట్టుకునే కథాంశంతో ఈ చిత్రం రూపొందిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. ‘‘వాణిజ్య హంగులతో హాస్యరస ప్రధానంగా రూపొందుతున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ఇది’’ అని చిరంజీవి కుంచల్‌ తెలిపారు. ‘‘ఈ చిత్రంతో కథానాయికగా పరిచయమవడం ఆనందంగా ఉంది’’ అని శ్రీలు అన్నారు. పృథ్వీరాజ్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకట్‌ సంగీతం అందిస్తున్నారు. 


Updated Date - 2021-07-16T08:55:57+05:30 IST