నృత్య దర్శకుడు శివ శంకర్‌ మాస్టర్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2021-11-29T02:25:32+05:30 IST

ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివ శంకర్‌ మాస్టర్‌ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, విజయ్‌ శివ శంకర్‌, అజయ్‌ శివ శంకర్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తెలుగు, తమిళ చిత్రాలు సహా 10 భాషల్లో 800లకు పైగా చిత్రాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు.

నృత్య దర్శకుడు శివ శంకర్‌ మాస్టర్‌ కన్నుమూత

ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివ శంకర్‌ మాస్టర్‌ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, విజయ్‌ శివ శంకర్‌, అజయ్‌ శివ శంకర్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తెలుగు, తమిళ చిత్రాలు సహా 10 భాషల్లో  800లకు పైగా చిత్రాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. నాలుగున్నర దశాబ్ధాలుగా సినీ రంగంలో కొరియోగ్రాఫర్‌గా కొనసాగారు. మొదట సహాయకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ‘కురు వికూడు’ చిత్రంతో నృత్య దర్శకుడిగా మారారు. నృత్య దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా ప్రేక్షకులను మెప్పించారు. 30పైగా చిత్రాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు పోషించారు. బుల్లితెర పైనా తనదైన ముద్రవేశారు. పలు టీవీ డాన్స్‌ రియాలటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహించారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన ఎంతో మంది ప్రస్తుతం టాప్‌ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్నారు. 


శివశంకర్‌ మాస్టర్‌ 1948 డిసెంబర్‌ 7న మద్రాస్‌లో జన్మించారు. తండ్రి కల్యాణ్‌ సుందర్‌ హోల్‌ేసల్‌ పండ్ల వ్యాపారం చేేసవారు. చిన్నతనంలోనే ఓ ప్రమాదం వల్ల శివశంకర్‌ వెన్నెముకకు తీవ్ర గాయమైంది. విదేశాల్లో డాక్టర్‌గా పనిచేసి మద్రాసు వచ్చిన నరసింహ అయ్యర్‌ అనే ఆయన వద్దకు శివ శంకర్‌ను తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీసి, వెన్నెముక విరిగిపోయిందని నిర్థారించారు. అప్పుడు ఆ డాక్టర్‌ శివ శంకర్‌ తల్లిదండ్రులకు ఒక సలహా ఇచ్చారు. ‘ఈ పిల్లాడిని ఎవరి వద్దకు తీసుకెళ్లకుండా నా దగ్గర వదిలేేస్త లేచి నడిచేలా చేయగలను అని మాటిచ్చారు. దాదాపు ఎనిమిదేళ్లు శివ శంకర్‌ పడుకునే ఉన్నారు.


చిన్నప్పటి నుంచి శివశంకర్‌కు పాటలంటే ప్రాణం. నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి శివ శంకర్‌ను పంపేవారు. వాటిని చూసి ఎలాగైనా డాన్స్‌ చేయాలన్న పట్టుదల ఆయనలో పెరిగింది. దాంతో తనంతట తానే డ్యాన్స్‌ నేర్చుకుని, 16ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేయడం మొదలు పెట్టారు. ఎలాగోలా ఎస్సెల్సీ పూర్తి చేసి డ్యాన్సు నేర్చుకుంటా’ అని తండ్రికి చెప్పారు. జాతకం ప్రకారం డాన్సర్‌ అవుతాడని ఉండడంతో అటువైపు దృష్టి మళ్లించారు. మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి దగ్గర  శివశంకర్‌ నృత్యం నేర్చుకున్నారు. ఆ తర్వాత సినిమా ఇండస్ర్టీలో సలీమ్‌ దగ్గర సహాయకుడిగా చేరి కెరీర్‌ను మొదలు పెట్టారు. దాదాపు 800 చిత్రాలకు డాన్స్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. ‘మగధీర’లో ‘ధీరధీర’ పాటకు శివ శంకర్‌ మాస్టర్‌ ఉత్తమ జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. నాలుగు సార్లు తమిళనాడు ేస్టట్‌ ఫిల్మ్‌ అవార్డులు సొంతం చేసుకున్నారు. ‘సర్కార్‌’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘రాజుగారి గది3’ తదితర చిత్రాల్లో నటించి అలరించారు. 


Updated Date - 2021-11-29T02:25:32+05:30 IST