శివకార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీ..?

ABN , First Publish Date - 2021-07-13T15:55:16+05:30 IST

మరో కోలీవుడ్ స్టార్ హీరో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..ప్రస్తుతం అవుననే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరో శివ కార్తికేయన్ త్వరలో నేరుగా ఓ తెలుగు సినిమాతో పరిచయం కాబోతున్నాడట.

శివకార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీ..?

మరో కోలీవుడ్ స్టార్ హీరో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..ప్రస్తుతం అవుననే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరో శివ కార్తికేయన్ త్వరలో నేరుగా ఓ తెలుగు సినిమాతో పరిచయం కాబోతున్నాడట. ఈ సినిమాను 'జాతి రత్నాలు' ఫేం అనుదీప్ తెరకెక్కించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ స్టార్స్ ధనుష్, విజయ్ తెలుగులో స్ట్రైట్ మూవీ చేస్తున్నారు. ఇదే వరుసలో శివ కార్తికేయన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. తమిళంలో 'రజనీ మురగన్', 'రెమో' లాంటి సినిమాలతో పాపులారిటీని సాధించాడు ఈ యంగ్ హీరో. ఆయన నటించిన తమిళ సినిమాలు తెలుగులోనూ డబ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఇటీవల అనుదీప్ ఓ కామెడీ థ్రిల్లర్ కథను శివకార్తికేయన్‌కి వినిపించాడని, ఈ కథ ఆయనకి నచ్చడంతో ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. ప్రస్తుతం 'డాక్టర్' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న శివకార్తికేయన్ ఆ తర్వాత 'డాన్' మూవీ చేయబోతున్నాడు.

Updated Date - 2021-07-13T15:55:16+05:30 IST