తమిళ ప్రేక్షకులనే కాకుండా తెలుగు ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటున్న తమిళ హీరో శివకార్తికేయన్ కొత్త చిత్రం ‘మహావీరుడు’ షూటింగ్ మొదలైంది. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దు కుంటున్న ఈ చిత్రంలో తమిళ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్ నటిస్తున్నారు. గ్రాండ్‌గా జరిగిన ఈ షూటింగ్ లాంచింగ్ ఈవెంట్‌కు శంకర్ ముఖ్య అతిధిగా హాజరై యూనిట్‌కు అభినందనలు తెలిపారు. యోగిబాబు, సరిత, మిస్కిన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విదు అయ్యన్న, సంగీతం: భరత్ శంకర్, ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్.