సిత్రాలు సూడరో...

ABN , First Publish Date - 2022-11-19T05:30:00+05:30 IST

లక్ష్మణ్‌, భ్రమరాంబిక, కిశోరి దాత్రక్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘సీతారాం సిత్రాలు’. డి.నాగ శశిధర్‌ రెడ్డి దర్శకుడు.

సిత్రాలు సూడరో...

లక్ష్మణ్‌, భ్రమరాంబిక, కిశోరి దాత్రక్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘సీతారాం సిత్రాలు’. డి.నాగ శశిధర్‌ రెడ్డి దర్శకుడు. పార్థ సారధి, నాగేందర్‌ రెడ్డి నిర్మాతలు. టైటిల్‌ లోగోను ప్రముఖ కెమెరామెన్‌ గుహన్‌ ఆవిష్కరించారు. ‘‘టైటిల్‌ కొత్తగా ఉంది. వినోద భరితమైన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకొంటుందన్న నమ్మకం ఉంద’’న్నారు గుహన్‌. ‘‘నువ్వు గెలవనంత వరకూ ఏం చెప్పినా చెత్తే.. గెలిస్తే చెత్త చెప్పినా చరిత్రే అనే పాయింట్‌ చుట్టూ అల్లుకొన్న కథ. సరదా సరదాగా సాగిపోతుంద’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. 

Updated Date - 2022-11-19T05:30:00+05:30 IST