మలయాళ స్టార్ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman) నటిస్తున్న రెండవ స్ట్రైట్ తెలుగు సినిమా ‘సీతారామం’ (Sita Ramam). యుద్ధంతో రాసిన ప్రేమకథ దీనికి ట్యాగ్ లైన్. త్వరలో నిర్వహించబోయో ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు గెస్టులు కన్‌ఫర్మ్ అయినట్టు తాజా సమాచారం. హనురాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ (Mrinal Thakur) కథానాయికగా, మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కీలక పాత్రలో నటించారు. స్వప్న సినిమాస్ (Swapna Cinemas) బ్యానర్ పై, వైజయంతి మూవీస్ సమర్పణలో నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 5న థియేటర్స్ విడుదల కాబోతోంది.
ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు తమిళ, మలయాళ వెర్షన్స్ లోనూ విడుదల చేయబోతున్నారు. ఇంతకు ముందు విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్, ట్రైలర్ మూవీపై భారీగా అంచనాలు పెంచాయి. ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, మురళీ శర్మ, సుమంత్ , భూమిక ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలోని చాలా భాగం కశ్మీర్ లో చిత్రీకరించారు. అయితే, ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
దీనిలో భాగంగా త్వరలో నిర్వహించబోయో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పాన్ ఇండియన్ స్టార్స్ ప్రభాస్, ఎన్టీఆర్ గెస్టులుగా హాజరవబోతున్నారట. వీరిద్దరూ వైజయంతీ మూవీస్ సంస్థలో సినిమాలు చేశారు. ఇంతకముందు ఎన్టీఆర్ తో శక్తి సినిమాను నిర్మించగా, ఇప్పుడు ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె సినిమాను నిర్మిస్తున్నారు. ఈ బాండింగ్ తోనే ‘సీతారామం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అతిథులుగా రమ్మని మేకర్స్ అడగగానే.. ఎన్టీఆర్, ప్రభాస్ ఒప్పుకున్నారట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతుందని సమాచారం.