సిరివెన్నెల హెల్త్‌ బులిటెన్‌

ABN , First Publish Date - 2021-11-30T00:28:34+05:30 IST

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం సాయంత్రం కిమ్స్‌ ఆస్పత్రి వరాలు సీతారామశాస్ర్తి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశాయి.

సిరివెన్నెల హెల్త్‌ బులిటెన్‌


గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం సాయంత్రం కిమ్స్‌ ఆస్పత్రి వరాలు సీతారామశాస్ర్తి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశాయి.


‘‘సిరివెన్నెల సీతారామశాస్ర్తి న్యూమోనియాతో బాధపడుతూ ఈ నెల 24న ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటిప్పుడు పరిశీలిస్తున్నారు. త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం’’’ అని కిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 




Updated Date - 2021-11-30T00:28:34+05:30 IST