మరణం గురించి ముందే తెలిసినట్టు.. ‘పక్కా కమర్షియల్’లో సిరివెన్నెల పాట

ABN , First Publish Date - 2022-01-28T23:37:51+05:30 IST

దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి‌కి తన మరణం గురించి ముందే తెలిసిపోయిందా? అంటే చివరి రోజులలో ఆయన రాసిన పాటలను చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఆయన కలం నుండి ఎన్నో స్ఫూర్తి దాయకమైన పాటలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి

మరణం గురించి ముందే తెలిసినట్టు.. ‘పక్కా కమర్షియల్’లో సిరివెన్నెల పాట

దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి‌కి తన మరణం గురించి ముందే తెలిసిపోయిందా? అంటే చివరి రోజులలో ఆయన రాసిన పాటలను చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఆయన కలం నుండి ఎన్నో స్ఫూర్తి దాయకమైన పాటలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి జాలువారాయి. పది మందిని ప్రభావితం చేసే పాట రాయాలంటే సిరివెన్నెల తర్వాతే ఎవరైనా. ఎన్నో అద్భుతమైన, ప్రభావవంతమైన పాటలను ప్రేక్షకులకు అందించారు సీతారామశాస్త్రి. అలాంటి లెజెండరీ రైటర్ కలం నుండి చివరిసారిగా జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో ఉన్నట్లుగా మేకర్స్ తెలుపుతున్నారు. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టైటిల్ సాంగ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. జనవరి 31న ఈ పాటకు సంబంధించిన గ్లిమ్ప్స్ విడుదల చేయనున్నారని, ఫిబ్రవరి 2న పూర్తి పాటను మేకర్స్ విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. 


‘జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు’ అని సిరివెన్నెల రాసిన లిరిక్స్‌ని తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. సిరివెన్నెల చివరిసారి రాసిన జీవిత సారాంశం ఈ పాటలో ఉండడంతో.. మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ.. సిరివెన్నెలని గుర్తు చేసుకున్నారు మారుతి. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు ఉన్నాయని.. జీవితం గురించి, పుట్టుక.. చావు గురించి అద్భుతమైన సాహిత్యం ‘పక్కా కమర్షియల్’ టైటిల్ సాంగ్‌లో ఉంటాయని ఆయన అంటున్నారు. కాగా, యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

Updated Date - 2022-01-28T23:37:51+05:30 IST