మహాప్రస్థానానికి సిరివెన్నెల భౌతిక కాయం తరలింపు

ABN , First Publish Date - 2021-12-01T17:46:01+05:30 IST

టాలీవుడ్ లెజెండరీ గీతరచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయాన్ని కాసేపటి క్రితం వరకూ ఫిల్మ్ ఛాంబర్ లో టాలీవుడ్ సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు తనివితీరా సందర్శించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని మహా ప్రస్థానానికి తరలించారు. ఆయన అంతిమయాత్రను తిలకించడానికి జనం రోడ్డు మీద బారులు తీరారు. ఆయనను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, అసంఖ్యాక ప్రజానీకం తరలివచ్చారు. కొందరు కారుల్లోనూ, మరికొందరు ద్విచక్రవాహానాల్లోనూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

మహాప్రస్థానానికి సిరివెన్నెల భౌతిక కాయం తరలింపు

టాలీవుడ్ లెజెండరీ గీతరచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయాన్ని కాసేపటి క్రితం వరకూ ఫిల్మ్ ఛాంబర్ లో టాలీవుడ్ సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు తనివితీరా సందర్శించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని మహా ప్రస్థానానికి తరలించారు. ఆయన అంతిమయాత్రను  తిలకించడానికి  జనం రోడ్డు మీద బారులు తీరారు. ఆయనను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, అసంఖ్యాక ప్రజానీకం తరలివచ్చారు. కొందరు కారుల్లోనూ, మరికొందరు ద్విచక్రవాహానాల్లోనూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అక్షర జ్ఞానికి నివాళులర్పించారు. 

Updated Date - 2021-12-01T17:46:01+05:30 IST