Sir : తెలుగు డబ్బింగ్ వదిలేసినట్టేనా?

ABN , First Publish Date - 2022-08-18T21:30:59+05:30 IST

ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరైన ధనుష్ (Dhanush)... మొదటిసారి స్ట్రెయిట్ తెలుగులో నటిస్తున్న సినిమా ‘సార్’ (Sir). సితారా ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) నిర్మిస్తున్న ఈ మూవీని వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్ చేస్తున్నాడు.

Sir :  తెలుగు డబ్బింగ్ వదిలేసినట్టేనా?

ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరైన ధనుష్ (Dhanush)... మొదటిసారి స్ట్రెయిట్ తెలుగులో నటిస్తున్న సినిమా ‘సార్’ (Sir). సితారా ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) నిర్మిస్తున్న ఈ మూవీని వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక గవర్నమెంట్ టీచర్, ప్రైవేట్ స్కూల్ లో పని చేయడానికి వెళ్లి.. ఆ వ్యవస్థ ప్రభుత్వ పాఠశాలలని ఎలా ద్వంసం చేస్తుంది? చదువు వ్యాపారంగా ఎలా మారుతుంది? అనే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రం అక్టోబర్ 13న రిలీజ్ కావాల్సి ఉంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ధనుష్‌తో డబ్బింగ్ చెప్పిస్తోంది.


ఈ ప్రోసెస్ లో ధనుష్ తమిళ డబ్బింగ్‌ని అద్భుతంగా చెప్తున్నాడట. సీన్స్‌లో ఉన్న ఎమోషన్‌ను మిస్ అవ్వకుండా తన డైలాగులు తనే రాసుకుంటున్నాడట. అయితే తమిళ్ పై అంత శ్రద్ద పెట్టిన ధనుష్, తెలుగు డబ్బింగ్‌ని మాత్రం లైట్ తీసుకుంటున్నాడట. ఎదో చేయాలి కాబట్టి చేస్తున్నట్లు, క్యాజువల్‌గా నిలబడి చేసేస్తున్నాడట. దీని కారణంగా ‘సార్’ సినిమా తెలుగు వెర్షన్ డైలాగ్స్ లో ఎమోషన్ మిస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇదే జరిగితే ఆడియన్స్ సీన్స్‌కు కనెక్ట్ అవ్వడం కష్టమని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారట. హాలివుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్న ధనుష్... ‘సార్’ బైలింగ్వల్ సినిమా అని, తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని మైండ్ లో పెట్టుకొని... తెలుగు డబ్బింగ్ పై కూడా దృష్టి పెడితే, ఈ మూవీ అతనికి తెలుగులో మంచి అటెంప్ట్ అవుతుంది. లేదంటే కోలివుడ్ లో సూపర్ హిట్ అయినా, తెలుగులో మాత్రం 'సార్' ఫెయిల్ అవుతాడని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

Updated Date - 2022-08-18T21:30:59+05:30 IST