యువన్‌ కోసం శింబు గానం

ప్రముఖ కోలీవుడ్‌ సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా రూపొందించిన ఆల్బమ్‌ కోసం హీరో శిలంబరసన్‌ టీఆర్‌(శింబు) గాయకుడుగా మారారు. ఈ ఆల్బమ్‌ త్వరలోనే విడుదల చేయనున్నారు. యువన్‌, శింబుల మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘మన్మథన్‌’, ‘వల్లవన్‌’, ‘సిలంబాట్టం’, ‘వానమ్‌’ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాల్లోని పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో శింబు నటించిన ‘మానాడు’ చిత్రానికి కూడా యువన్‌ శంకర్‌ రాజానే సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని తొలి సాంగ్‌ను ఇటీవల రిలీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో యువన్‌ సొంతంగా తయారు చేసిన ఒక ఆల్బమ్‌ కోసం శింబు గాయకుడుగా మారారు. గతంలో పలు చిత్రాల్లో పాటలు పాడిన అనుభవం ఈ హీరోకు ఉంది. దీంతో ఈ ఆల్బమ్‌ కోసం శింబు ఓ పాటను అలపించారు. మరోవైపు, ఈ ఆల్బమ్‌లో కోసం నటుడు కాళిదాస్‌ జయరామ్‌, నటి మేఘా ఆకా్‌షలు నటించగా, శాండి కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ ఆల్బమ్‌ను విడుదల చేసేందుకు యువన్‌ ప్రయత్నిస్తున్నారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.