ఏజీఎస్ సంస్థతో శింబు ఒప్పందం

కోలీవుడ్‌ హీరో శింబు గత సంక్రాంతికి ‘ఈశ్వరన్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు శింబు, కళ్యాణి ప్రియదర్శిని నటించిన ‘మానాడు’ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబరులో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దీని తర్వాత గౌతం కార్తీక్‌ దర్శకత్వంలో ‘పత్తు తల’ అనే చిత్రంలోను, గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలో ముచ్చటగా మూడో చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి ‘నదిగళిల్‌ నీరాడుమ్‌ సూరియన్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇదిలా ఉండగా స్టార్‌ హీరో విజయ్‌ నటించిన ‘బిగిల్‌’ చిత్రాన్ని నిర్మించిన ఏజీఎస్‌ నిర్మాణ సంస్థతో శింబు ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సంస్థ కొత్తగా నిర్మించనున్న ప్రాజెక్టులో శింబు నటించేందుకు కమిట్‌ అయ్యారట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.