‘శ్యామ్ సింగరాయ్’: ఈ సీన్ బాగానే ఉందిగా.. ఎందుకు తీసేశారో?

ABN , First Publish Date - 2022-01-23T02:30:44+05:30 IST

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రానికి సంబంధించి తొలగించిన సీన్‌ను చిత్రయూనిట్ శనివారం విడుదల చేసింది. ఈ సీన్‌లో వేశ్యలందరినీ ఒక చోట కూర్చోబెట్టి.. వారిపై తను రాసిన లేఖను

‘శ్యామ్ సింగరాయ్’: ఈ సీన్ బాగానే ఉందిగా.. ఎందుకు తీసేశారో?

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రానికి సంబంధించి తొలగించిన సీన్‌ను చిత్రయూనిట్ శనివారం విడుదల చేసింది. ఈ సీన్‌లో వేశ్యలందరినీ ఒక చోట కూర్చోబెట్టి.. వారిపై తను రాసిన లేఖను శ్యామ్ సింగరాయ్ చదివి వినిపిస్తున్నారు. అందులో ఒక వేశ్య.. ‘‘ఇంత తెలిసిన నీవు.. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని అడుగుతుంది. దీనికి శ్యామ్ ‘‘ఖచ్చితంగా చేసుకుంటాను.. నిన్న ప్రేమించిన రోజు’’ అని సమాధానమిచ్చారు. ఈ సీన్ చూడడానికి చాలా బాగుంది. మరి దీనిని సినిమా నుండి ఎందుకు తీసేశారో.. చిత్రయూనిట్‌కే తెలియాలి.


నాని సరసన సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై‌ రాహుల్‌ సంకృత్యాన్ దర్శకత్వంలో.. వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. థియేటర్లలోనే కాకుండా తాజాగా ఓటీటీలో కూడా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, క్రికెటర్ హనుమ విహారి వంటి వారెందరో ఈ చిత్రంపై ప్రశంసలు వర్షం కురిపించారు. కాగా, ప్రస్తుతం విడుదల చేసిన ఈ తొలగించిన సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Updated Date - 2022-01-23T02:30:44+05:30 IST