మంత్రగత్తె అంటూ విమర్శలు.. శృతి హాసన్ రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-01-14T13:18:01+05:30 IST

స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చి నటిగా మంచి గుర్తింపు సాధించింది శృతి హాసన్...

మంత్రగత్తె అంటూ విమర్శలు.. శృతి హాసన్ రియాక్షన్ ఏంటంటే..

స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చి నటిగా మంచి గుర్తింపు సాధించింది శృతి హాసన్. అయితే ఈ భామ నటికాక ముందు నుంచే మంచి గాయని. ఈ కెరీర్‌లోకి రాకముందే కొన్ని ఆల్బమ్స్ సైతం చేసింది. అయితే రెండు సంవత్సరాల క్రితం మ్యూజిక్ మీద కాన్సన్‌ట్రేట్ చేయడానికి నటనకి కొంచెం విరామం ఇచ్చింది.


అయితే ఈ విషయంపై ఎంతో మంది నెటిజన్లు శృతిపై విమర్శలు గుప్పించారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ మాట్లాడుతూ.. ‘సంగీతంపై దృష్టిపెట్టడానికి నటన నుంచి కొంచెం విరామం తీసుకున్నాను. లండన్‌లో మ్యూజిక్ సంబంధించి స్టోరీస్ రాశాను. అనంతరం మళ్లీ సినిమాలకి రావాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ ఆ సమయంలో నా డ్రెసింగ్‌పై కొంతమంది నన్ను పిశాచి, భయాకరంగా ఉంది, మంత్ర గత్తెల ఉందంటూ విమర్శలు చేశార’ని బాధపడింది.


అంతేకాకుండా.. ‘అయినా పర్వాలేదు. ఎవరికి ఎలా నచ్చితే అలా పిలుచుకోవచ్చు. మీరు నన్ను మంత్రగత్తె అని పిలుస్తుంటే నాకు చాలా శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది.  అయితే ప్రస్తుతం అందరూ ఏం చేయలేక వదిలేశార’ని చెప్పింది. 


కాగా, దాదాపు రెండు సంవత్సరాలు నటనకు విరామం తీసుకున్న శృతి ప్రస్తుతం వరుస సినిమాలు సైన్ చేస్తోంది. అందులో ప్రభాస్‌తో కలిసి ‘సలార్’ అనే పాన్ ఇండియా చిత్రం కూడా ఉంది.

Updated Date - 2022-01-14T13:18:01+05:30 IST