Shruti Haasan: ఆ రోజు ఏమవుతానో ఊహించలేదు!

ABN , First Publish Date - 2021-07-25T23:55:19+05:30 IST

విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ ముద్దుల కూతురు కథానాయికగా కెరీర్‌ మొదలుపెట్టి 12 వసంతాలు పూర్తయింది. హిందీ సినిమా ‘లక్‌’తో హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె పుష్కర కాలంలో 35 చిత్రాల్లో నటించారు.

Shruti Haasan: ఆ రోజు ఏమవుతానో ఊహించలేదు!

విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ ముద్దుల కూతురు కథానాయికగా కెరీర్‌ మొదలుపెట్టి 12 వసంతాలు పూర్తయింది. హిందీ సినిమా ‘లక్‌’తో హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె పుష్కర కాలంలో 35 చిత్రాల్లో నటించారు. ‘అనగనగా ఒక ధీరుడు’ టాలీవుడ్‌కి పరిచయమైన ఈ అమ్మడికి ప్రారంభంలో సక్సెస్‌లుగా లేక ఐరెన్‌లెగ్‌ మార్క్‌ పడింది. ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. 2012లో విడుదలైన ‘గబ్బర్‌సింగ్‌’తో సూపర్‌హిట్‌ అందుకుని గోల్డెన్‌ లెగ్‌ అనిపించుకుంది. అక్కడ నుంచి సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది శ్రుతీహాసన్‌. అంతే కాదు ఆమె మల్టీ టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. నటన మాత్రమే కాకుండా సంగీతం, పాటలు పాడడంలో కూడా ఆమె నిరూపించుకున్నారు. ఆమె పరిచయ చిత్రం ‘లక్‌’ విడుదలై ఈ నెల 24 శనివారానికి 12 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఇన్నేళ్లగా తనను ఆదరిస్తున్న అభిమానులకు శ్రుతీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘12 ఏళ్ల క్రితం ఈ రోజున నేనేంటో.. ఏమవుతానో,  ఏం సాధిస్తానో కూడా తెలీదు. ఇష్టపడిన పనిని చేయాలని, ప్రతిరోజు గొప్పగా ఉండాలని తపన పడేదానిని. ఇప్పటికీ అదే పద్దతిలో ఉన్నా. ఎత్తు పల్లాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు కొత్త జర్నీలా భావిస్తాను. నా సక్సెస్‌లో ప్రేక్షకుల పాత్ర కీలకం. ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను’’ అని శ్రుతీహాసన్‌ రాసుకొచ్చారు. తాజాగా ‘వకీల్‌సాబ్‌’, ‘క్రాక్‌’తో భారీ విజయం అందుకున్న శ్రుతీ తమిళంలో ‘లాభం’, తెలుగులో ‘సలార్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. 










Updated Date - 2021-07-25T23:55:19+05:30 IST