Shruti haasan: అమెజాన్ ప్రైమ్‌లో 'బెస్ట్ సెల్లర్'..

ABN , First Publish Date - 2022-01-29T13:55:19+05:30 IST

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నటించిన 'బెస్ట్ సెల్లర్' వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకు సిద్దమవుతోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో ముకల్ అభ్యంకర్ ఈ వెబ్ సిరీస్‏ను తెరకెక్కించారు.

Shruti haasan: అమెజాన్ ప్రైమ్‌లో 'బెస్ట్ సెల్లర్'..

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నటించిన 'బెస్ట్ సెల్లర్' వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకు సిద్దమవుతోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో ముకల్ అభ్యంకర్ ఈ వెబ్ సిరీస్‏ను తెరకెక్కించారు. సిద్ధార్థ్ పి.మల్హోత్రా ఈ సిరీస్‏ను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 18న ఈ వెబ్ సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా వదిలారు. రవి సుబ్రమణియన్ నవల 'ది బెస్ట్ సెల్లర్' ఆధారంగా దీనిని రూపొందించారు. ఇందులో సూపర్ స్టార్ నవలా రచయితగా మిథున్ చక్రవర్తి.. ఆయన ప్రేయసిగా శృతి హాసన్ కనిపించబోతున్నారు. 

Updated Date - 2022-01-29T13:55:19+05:30 IST