సలార్‌: శ్రుతీహాసన్‌ లుక్‌ వచ్చేసింది

ABN , First Publish Date - 2022-01-28T16:46:52+05:30 IST

మల్టీ టాలెండెట్‌ హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ పుట్టినరోజు సందర్భంగా ‘సలార్‌’ చిత్రంలోని ఆమె లుక్‌ను విడుదల చేశారు. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ ఆద్యా పాత్రలో కనిపించనున్నారు.

సలార్‌: శ్రుతీహాసన్‌ లుక్‌ వచ్చేసింది

మల్టీ టాలెండెట్‌ హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ పుట్టినరోజు సందర్భంగా ‘సలార్‌’ చిత్రంలోని ఆమె లుక్‌ను విడుదల చేశారు. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ ఆద్యా పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్‌ సరసన శ్రుతీ నటిస్తున్న తొలి చిత్రమిది. శుక్రవారం శ్రుతీహాసన్‌ బర్త్‌డే సందర్భంగా హోంబలే సంస్థ శ్రుతీ లుక్‌ను విడుదల చేసింది. స్టైలిష్‌ లుక్‌లో శ్రుతీ అలరిస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. 




Updated Date - 2022-01-28T16:46:52+05:30 IST