తల్లినయ్యాక చాలా లావయ్యా.. ఆ రెండింటి వల్లే బరువు తగ్గి మునుపటిలా మారిపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన Shriya Saran

శ్రియా శరణ్... ఈ పేరు తెలియని తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులు దాదాపుగా ఉండరు. పలు భాషల్లో నటించిన ఆమె దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే, నటిగా జనం దృష్టిలో ఎంతగా ఉన్నప్పటికీ శ్రియ వ్యక్తిగతంగా మాత్రం కొంచెం కూడా బయటపడదు. ఆమె ప్రేమ, పెళ్లి కూడా అప్పట్లో అందరికీ షాకింగ్ న్యూసులుగానే తెలిశాయి. రష్యన్ అందగాడు ఆండ్రీ కొశ్చేవ్‌ను వివాహమాడేదాకా ఎవ్వరికీ తన మ్యాటర్‌ను లీక్ చేయలేదు టాలెంటెడ్ బ్యూటీ. రీసెంట్‌గా తాను తల్లినయ్యానంటూ మరోసారి అటువంటి స్వీట్ సర్‌ప్రైజే ఇచ్చింది శ్రియ...


2020 లాక్‌డౌన్ సమయంలో ఏ మాత్రం హడావిడి లేకుండా ఓ ముద్దుల పాపాయికి తల్లైపోయింది శ్రియ. ఆ విషయం తీరిగ్గా తన కూతురికి 9 నెలలు నిండాకగానీ నెటిజన్స్‌కు చెప్పలేదు. ఎట్టకేలకు సొషల్ మీడియాలో తన క్యూట్ డాటర్ పిక్ షేర్ చేసిన గార్జియస్ మామ్ ప్రస్తుతం మళ్లీ వర్క్ మోడ్‌లోకి వచ్చేసింది. ‘గమనం’ సినిమా ప్రమోషన్స్‌తో బిజిబిజీగా ఉంది. త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’తో కూడా తన ఫ్యాన్స్‌ను అలరించబోతోంది.


పెళ్లికి ముందు, పెళ్లి తరువాత ఒకేలా తన లుక్ మెయింటైన్ చేసిన శ్రియా శరణ్ ఇప్పుడు మమ్మీ అయ్యాక కూడా యమ్మీగానే ఊరించేస్తోంది! ప్రెగ్నెన్సీ, డెలివరీ తాలూకూ ఎఫెక్ట్ ఏదీ ఆమెపైన కనిపించటం లేదు. ఎప్పటిలాగే గ్లామరస్‌గా కనిపిస్తోంది హాట్ బ్యూటీ. అయితే, తన పర్ఫెక్ట్ షేప్ వెనుక సీక్రెట్ రివీల్ చేసిన శ్రియా రెండు కారణాలు చెప్పింది. బిడ్డ పుట్టాక ఆమె కథక్ ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టిందట. శ్రియా ఎన్నో ఏళ్లుగా కథక్ శాస్త్రీయ నృత్యం సాధన చేస్తోంది. అదే డెలివరీ తరువాత కూడా మళ్లీ కొనసాగించిందట. ఇక యోగా కూడా శ్రియా జీవితంలో ఎప్పట్నుంచో అంతర్భాగం. అదే ప్రసవం తరువాత శ్రియా చకచకా సన్నబడేలా చేసిందట!  

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.