టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా ‘షార్ట్‌కట్‌’

ABN , First Publish Date - 2021-09-23T16:30:06+05:30 IST

ప్రతిష్ఠాత్మక టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘షార్ట్‌కట్‌’ తమిళ చిత్రం రెండు అవార్డులను సొంతం చేసుకుంది. వీటిలో ఒకటి ఉత్తమ చిత్రం కాగా రెండోది ఉత్తమ నటుడు అవార్డు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన యువ నటుడు శ్రీధర్‌ తాను నటించిన తొలి చిత్రంలోనే బెస్ట్‌ యాక్టర్‌ అవార్డును గెలుచుకున్నారు.

టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా ‘షార్ట్‌కట్‌’

ప్రతిష్ఠాత్మక టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘షార్ట్‌కట్‌’ తమిళ చిత్రం రెండు అవార్డులను సొంతం చేసుకుంది. వీటిలో ఒకటి ఉత్తమ చిత్రం కాగా రెండోది ఉత్తమ నటుడు అవార్డు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన యువ నటుడు శ్రీధర్‌ తాను నటించిన తొలి చిత్రంలోనే బెస్ట్‌ యాక్టర్‌ అవార్డును గెలుచుకున్నారు. దర్శకుడు మణి దామోదరన్‌ ఈ చిత్రాన్ని సొషియో-పొలిటికల్‌ మూవీగా రూపొందించారు. ఈ చిత్రం టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ ఫిల్మ్‌ ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌ అనే కేటగిరీలో స్పెషల్‌ జ్యూరీ అవార్డును గెలుచుకుంది. 

అలాగే, శ్రీధర్‌ బెస్ట్‌ యాక్టర్‌ డెబ్యూ కేటగిరీలో స్పెషల్‌ జ్యూరీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ చిత్ర కథ గురించి దర్శకుడు మణి దామోదరన్‌ మాట్లాడుతూ, ‘డబ్బు కోసం ఓటును అమ్ముకోవడమంటే డబ్బులు తీసుకుని టాయిలెట్‌ను అద్దెకు ఇవ్వడం వంటిదే. ఈ కారణంగానే మన దేశంతో పాటు రాజకీయాలు కంపు కొడుతున్నాయి. ఇదే షార్ట్‌కట్‌ మూవీ కథ. చేతిలో చిల్లిగవ్వలేని నలుగురు కుర్రోళ్ళకు రాత్రికి రాత్రే ఙ్ఞానోదయమై ఇతరులను మోసగించి ఒక్క రోజులోనే కోటీశ్వరులవుతారన్న విషయాన్ని లాజిక్‌తో చెప్పడం జరిగింది. తమిళ చిత్ర పరిశ్రమలోనే తొలిసారి రెడ్‌ జెమినీ కెమెరా ద్వారా ఈ చిత్రాన్ని షూట్‌ చేశాం’ అని వివరించారు. మణి అండ్‌ మణి క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత ఎం.శరవణన్‌ నిర్మించగా, సంగీతం కేఎం రాయన్‌ అందించారు. కెమెరామన్లుగా విజయ్‌ కృష్ణ, మహేష్‌ శ్రీధర్‌ వ్యవహరించగా ఎడిటింగ్‌ పనులను విదుజీవ పూర్తి చేశారు. 

Updated Date - 2021-09-23T16:30:06+05:30 IST