Godfather: మెగాస్టార్ సినిమాకు షాకింగ్ బిజినెస్..!

ABN , First Publish Date - 2022-09-21T21:56:45+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’ (Godfather). నయనతార (Nayanthara), సత్యదేవ్ (Satyadev), సల్మాన్ ఖాన్ (Salman Khan) కీలక పాత్రలు

Godfather: మెగాస్టార్ సినిమాకు షాకింగ్ బిజినెస్..!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గాడ్‌‌ఫాదర్‌’ (Godfather). నయనతార (Nayanthara), సత్యదేవ్ (Satyadev), సల్మాన్ ఖాన్ (Salman Khan) కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’ కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సినిమాను అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ‘గాడ్‌ఫాదర్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సినిమా ప్రమోషన్స్‌ను కూడా వేగవంతం చేశారు. ఈ సినిమాకు షాకింగ్ బిజినెస్ జరిగినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కలుపుకొని దాదాపుగా రూ.200కోట్ల బిజినెస్ జరిగినట్టు పుకార్లు షికార్లు కొడుతున్నాయి.   


‘గాడ్‌ఫాదర్’ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. అందుకు గాను భారీగానే చెల్లించినట్టు సమాచారం. తెలుగు, హిందీ లాంగ్వేజేస్ ఓటీటీ రైట్స్‌కు నెట్‌ఫ్లిక్స్ రూ.57కోట్లు చెల్లించినట్టు వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. ‘గాడ్‌ఫాదర్’ లో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించడంతో పాటు ఓ పాటకు కాలు కదిపాడు. అందువల్ల ఆడియో, శాటిలైట్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆడియో, శాటిలైట్ రైట్స్‌ ద్వారా రూ.60కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. చిరు సినిమా అంటేనే థియేటిక్రల్ రైట్స్‌ బిజినెస్ జోరుగా జరుగుతుంది. ఈ హక్కుల బిజినెస్ రూ.90కోట్లు అని వార్తలు వెలువడుతున్నాయి. ‘గాడ్‌ఫాదర్’ కు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మొత్తంగా రూ.207కోట్లు లభించాయని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. చిరు నుంచి వచ్చిన చివరి సినిమా ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయింది. అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారు. అయినప్పటికి, గాడ్‌ఫాదర్ సినిమాకు షాకింగ్ ప్రి రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. ప్రస్తుతం చిరు చేతిలో అనేక ప్రాజెక్టులున్నాయి. ‘భోళా శంకర్’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు చేస్తున్నాడు.   

Updated Date - 2022-09-21T21:56:45+05:30 IST