Godfather : హిందీ డిజిటల్, శాటిలైట్ రైట్స్‌‌కు షాకింగ్ రేట్ ?

ABN , First Publish Date - 2022-06-21T22:50:16+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ‘గాడ్ ఫాదర్’ (Godfather) ఒకటి. మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ (Lucifer) ఆధారంగా ఈ సినిమాని తమిళ దర్శకుడు మోహన్ రాజా (Mohanaraja)తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. విలన్ గా జగపతిబాటు నటిస్తున్నట్టు సమాచారం.

Godfather : హిందీ డిజిటల్, శాటిలైట్ రైట్స్‌‌కు షాకింగ్ రేట్ ?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ‘గాడ్ ఫాదర్’ (Godfather) ఒకటి. మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ (Lucifer) ఆధారంగా ఈ సినిమాని తమిళ దర్శకుడు మోహన్ రాజా (Mohanaraja)తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. విలన్ గా జగపతిబాటు నటిస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salmankhan) ప్రధాపాత్రలో నటిస్తుండడంతో సినిమాకి మరింతగా హైపు క్రియేట్ అయింది. చిరంజీవికి కుడిభుజంలాంటి ఆ పాత్రను మలయాళ వెర్షన్ లో పృధ్విరాజ్ (Pridhviraj) చేశాడు. ఇక చిరు, సల్మాన్ ఖాన్ లపై ఒక పాటకూడా ఉండబోతోంది. దానికి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. తమన్ (Thaman) సంగీతం సమకూర్చిన అదిరిపోయే ఆ పాటకు చిరు, సల్లూభాయ్ కలిసి చిందులేయడం అభిమానులకు పండగే. 


పొలిటికల్ థ్రిల్లర్ గా ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్నట్టు సమాచారం. ‘పుష్ప (Pushpa), ఆర్.ఆర్.ఆర్ (RRR) , కేజీఎఫ్ 2 (KGF2)’ చిత్రాలు బాలీవుడ్ లోనూ విడుదలై.. రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘గాడ్‌ఫాదర్’ చిత్రాన్ని కూడా బాలీవుడ్ లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ సినిమా హిందీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం ఏకంగా రూ. 45 కోట్ల డీల్ సెట్ అయిందట. సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తుండడం వల్లనే సినిమాకి అంత పెద్ద మొత్తంలో డీల్ దక్కిందని వేరే చెప్పాలా. అలాగే ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయబోతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఆగస్ట్ లో కానీ, సెప్టెంబర్ లో కానీ ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇటీవల ఓ కార్యక్రమంలో చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే. మరి ‘గాడ్‌ఫాదర్’ చిత్రం బాలీవుడ్ లో ఏ స్థాయిలో సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి. 

Updated Date - 2022-06-21T22:50:16+05:30 IST