శింబుకు షాక్..'మానాడు' బెనిఫిట్ షోస్ అన్నీ క్యాన్సిల్

కోలీవుడ్ హీరో శింబుకు మరో షాక్ తగిలింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా రూపొందిన సినిమా 'మానాడు'. ఈరోజు విడుదలైన ఈ సినిమా బెనిఫిట్ షోస్ అన్నీ సడన్‌గా క్యాన్సిల్ అయ్యాయి. ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను సురేష్ కామచ్చి నిర్మించారు. తెలుగులో 'ది లూప్' పేరుతో విడుదల చేస్తున్నారు. ఫిక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన 'మానాడు' ఈరోజు చెన్నైలో ఉదయం 5 గంటలకు భారీ స్థాయిలో విడుదల కావాల్సింది. అయితే, చివరి నిమిషంలో బెనిఫిట్ షోలన్నీ రద్దయ్యాయి. కేడిఎం సమస్యలే ఈ మూవీ ఎర్లీ మార్నింగ్ షోస్ రద్దుకు కారణం అని తెలుస్తోంది.  

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.