అందాల న‌టుడి ఆవ‌లి కోణం

ABN , First Publish Date - 2020-03-15T18:39:08+05:30 IST

శోభ‌న్‌బాబు న‌టించిన చిత్రాల్లో ‘చెల్లెలి కాపురం’ ఒక‌టి. అందాల న‌టుడిగా త‌న‌కున్న ఇమేజ్‌ను ప‌క్క‌న పెట్టి డీ గ్లామరైజ్డ్ రోల్‌ను పోషించారాయ‌న‌.

అందాల న‌టుడి ఆవ‌లి కోణం

శోభ‌న్‌బాబు న‌టించిన చిత్రాల్లో ‘చెల్లెలి కాపురం’ ఒక‌టి. అందాల న‌టుడిగా త‌న‌కున్న ఇమేజ్‌ను ప‌క్క‌న పెట్టి డీ గ్లామరైజ్డ్ రోల్‌ను పోషించారాయ‌న‌. చెల్లెలి కాపురం కోసం ర‌చ‌యిత‌గా త‌న కెరీర్‌ను త్యాగం చేయ‌డానికి సిద్ధ‌ప‌డిన అన్న‌గా అద్భుతంగా న‌టించారు. ఈ సినిమా కోసం శోభ‌న్‌బాబు తీసుకున్న పారితోషకం అక్ష‌రాల ప‌దిహేను వేల రూపాయ‌లు. ఈ సినిమాతో ఉత్త‌మ న‌టుడిగా అవార్డుని అందుకున్నారు. న‌టుడు మ‌న్నవ బాల‌య్య నిర్మాత‌గా మారి అమృతా ఫిలింస్ బేన‌ర్‌పై నిర్మించిన తొలి చిత్ర‌మిదే. తుపాను ప‌క్ష ప‌త్రిక‌లో బాల‌య్య రాసిన ‘న‌లుపు - తెలుపు’ క‌థ ఈ చిత్రానికి ఆధారం. మూల‌క‌థ‌కు దర్శ‌కుడు కె.విశ్వ‌నాథ్ మ‌రిన్ని మెరుగులు దిద్దారు. నాలుగున్న‌ర ల‌క్ష‌ల వ్య‌యంతో త‌యారైన ‘చెల్లెలి కాపురం’ 1971 డిసెంబ‌ర్ 27న విడుద‌లైంది. వాణిశ్రీ క‌థానాయిక‌గా న‌టించారు. ఇదే చిత్రాన్ని ‘అన్బు తంగై’ పేరుతో తమిళంలో నిర్మించగా అందులో ఎంజీఆర్‌, జ‌య‌ల‌లిత జంట‌గా న‌టించారు. 

Updated Date - 2020-03-15T18:39:08+05:30 IST