శింబు - గౌతమ్ మీనన్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ రూపొందబోతోందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో 'విన్నయ్ తాండి వరువాయా', 'అచ్చం యెన్బదు మడమైదా' సినిమాలు వచ్చి హిట్స్‌గా నిలిచాయి. దాంతో త్వరలో హ్యాట్రిక్ మూవీకి సన్నాహాలు చేస్తుండగా, ఆస్కార్ అవార్డ్ విన్నిర ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించబోతున్నారట. 'నదిగళిలే నీరాడుమ్ సూరియన్' అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ మూవీ సెట్స్‌పైకి రాకముందే ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ నెలకొంది. 'వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్' బ్యానర్ పై కే. గణేశ్ నిర్మించబోయే దీనికి జయమోహన్ రచయితగా వ్యవహరించనున్నాడు. త్వరలోనే ఈ హ్యాట్రిక్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్, పూర్తి వివరాలు వెల్లడవుతాయని సమాచారం.