శీలో రక్షతి రక్షత:

ABN , First Publish Date - 2021-11-14T07:50:19+05:30 IST

సంపూర్ణేష్‌ బాబు తాజా చిత్రం ‘క్యాలీ ఫ్లవర్‌’ ను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు వెల్లడిస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ‘మగాడిదీ శీలమేగా’ అనే ఆసక్తికరమైన కాప్షన్‌తో రిలీజ్‌ అయిన ఈ పోస్టర్‌ అందర్నీ ఆకర్షిస్తోంది...

శీలో రక్షతి రక్షత:

సంపూర్ణేష్‌ బాబు తాజా చిత్రం ‘క్యాలీ ఫ్లవర్‌’ ను  ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు వెల్లడిస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ‘మగాడిదీ శీలమేగా’ అనే ఆసక్తికరమైన కాప్షన్‌తో రిలీజ్‌ అయిన ఈ పోస్టర్‌ అందర్నీ ఆకర్షిస్తోంది. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక కావడం గమనార్హం.  ఆర్కే మలినేని దర్శకత్వంలో ఆశాజ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. వాసంతి హీరోయిన్‌గా నటించారు. పోసాని కృష్ణమురళి, పృధ్వీ, నాగమహేశ్‌, గెటప్‌ శ్రీను, కాదంబరి కిరణ్‌కుమార్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: గోపీకిరణ్‌, మాటలు: రైటర్‌ మోహన్‌, పరమతముని శివరామ్‌,  సంగీతం: ప్రజ్వల్‌ క్రిష్‌, ఛాయాగ్రహణం: ముజీర్‌ మాలిక్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరిబాబు జెట్టి, సమర్పణ: శ్రీధర్‌ గూడూరు.


Updated Date - 2021-11-14T07:50:19+05:30 IST