Shashthi: లఘు చిత్రానికి 77 అవార్డులా?.. ఆశ్చర్యపోయిన దర్శకుడు

ABN , First Publish Date - 2022-11-30T14:42:32+05:30 IST

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు లఘు చిత్రాలు ఒక విజిటింగ్‌ కార్డు వంటివని ప్రముఖ నట, దర్శకుడు కె.భాగ్యరాజ్‌ (K. Bhagyaraj) తెలిపారు..

Shashthi: లఘు చిత్రానికి 77 అవార్డులా?.. ఆశ్చర్యపోయిన దర్శకుడు

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు లఘు చిత్రాలు ఒక విజిటింగ్‌ కార్డు వంటివని ప్రముఖ నట, దర్శకుడు కె.భాగ్యరాజ్‌ (K. Bhagyaraj) తెలిపారు. అలాంటిది ఒక లఘు చిత్రానికి ఏకంగా 77 అవార్డులు రావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కథి అండ్‌ రఫీ ఫిలిమ్స్‌ బ్యానరుపై నిర్మించిన ‘షష్ఠి’ (Shashthi) అనే లఘు చిత్రం వివిధ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించగా.. ఏకంగా 77 అవార్డులు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.


ఈ సందర్భంగా కె.భాగ్యరాజ్‌ మాట్లాడుతూ.. ‘వివిధ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక అవడమే కాకుండా.. ఏకంగా 77 అవార్డులను గెలుచుకున్న ఈ లఘు చిత్రానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఇంత సాదాసీదాగా నిర్వహించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దర్శకుడు జాన్‌ పీటర్‌ డామియన్‌ సినిమాపై ఉన్న మక్కువతోనే ఈ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అలాగే, దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కూడా సినిమాపై ఉన్న మక్కువతో బ్యాంకు ఉద్యోగం వదిలేసి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఇపుడు ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అయితే, కేవలం సినిమాలు తీయాలనిపిస్తే సరిపోదు.. దానికి సంబంధించిన కోర్సును దర్శకుడు పూర్తి చేసి ఎంట్రీ ఇచ్చారు. అది అతనికి సినిమాపై ఉన్న ఫ్యాషన్‌. సినిమాపై మక్కువ ఉన్న ఔత్సాహిక యువత మనస్సుపెట్టి ప్రయత్నిస్తే విజయం ఖాయమన్నారు.


షార్ట్ ఫిల్మ్ దర్శకుడు జూట్‌ పీటర్‌ మాట్లాడుతూ.. ‘ఈ షార్ట్ ఫిల్మ్ ఒకటి రెండు అవార్డులు మాత్రమే వస్తాయని అనుకున్నాను. కానీ.. ఇన్ని అవార్డులు రావడం నాకే ఆశ్చర్యంగా ఉంది’ అని అన్నారు. ఈ లఘు చిత్రంలో చెమ్మలర్‌ అన్నం, లిజి ఆంటోనీ, డాక్టర్‌ ఎస్‌.కె.గాయత్రి, హారీస్‌, మాస్టర్‌ జెఫ్రీ జేమ్స్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.



Updated Date - 2022-11-30T14:42:32+05:30 IST