‘లైగర్‌’లో షణ్ముఖ ప్రియ పాట

ABN , First Publish Date - 2021-09-07T06:56:55+05:30 IST

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘లైగర్‌’. ఇందులో ఓ పాటను సింగింగ్‌ రియాలిటీ షో ‘ఇండియన్‌ ఐడల్‌ 12’ ఫైనలిస్టుల్లో ఒకరైన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ పాడారు...

‘లైగర్‌’లో షణ్ముఖ ప్రియ పాట

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘లైగర్‌’. ఇందులో ఓ పాటను సింగింగ్‌ రియాలిటీ షో ‘ఇండియన్‌ ఐడల్‌ 12’ ఫైనలిస్టుల్లో ఒకరైన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ పాడారు. ఇటీవల తల్లితో కలిసి తన అభిమాన హీరో విజయ్‌ దేవరకొండను ఆమె కలిశారు. ‘ఇండియన్‌ ఐడల్స్‌’ ఫైనల్స్‌కు వెళ్లినప్పుడు షణ్ముఖ ప్రియకు విజయ్‌ దేవరకొండ శుభాకాంక్షలు చెప్పారు. అలాగే, తన సినిమాలో పాడే అవకాశం ఇస్తానని మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. ‘‘నీ పాటను నేనింకా వినలేదు. త్వరగా ఫైనల్‌ మిక్సింగ్‌కి పంపమని అడుగుతా. తప్పకుండా సినిమాలో ఉంచుతాం’’ అని షణ్ముఖ ప్రియతో విజయ్‌ దేవరకొండ చెప్పారు. కథానాయికగా అనన్యా పాండే, కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్‌, చార్మీ కౌర్‌, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.


Updated Date - 2021-09-07T06:56:55+05:30 IST