సింగిల్ టేక్‌లో.. స్టార్ దర్శకుడి కుమార్తె కుమ్మేస్తుందట!

ABN , First Publish Date - 2021-09-25T22:27:18+05:30 IST

పూర్తి గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం కూడా గతంలో కార్తీ - ముత్తయ్య కాంబోలో వచ్చిన ‘కొంబన్‌’ చిత్రం తరహాలోనే ఉండేలా ప్లాన్‌ చేశారు. ఇందులో కొత్త హీరోయిన్‌ ఉండాలని భావించిన దర్శకుడు..

సింగిల్ టేక్‌లో.. స్టార్ దర్శకుడి కుమార్తె కుమ్మేస్తుందట!

స్టార్‌ దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితి శంకర్‌ హీరోయిన్‌గా కార్తీ నటించే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమవుతోంది. ‘విరుమన్‌’  పేరుతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం కూడా గతంలో కార్తీ - ముత్తయ్య కాంబోలో వచ్చిన ‘కొంబన్‌’ చిత్రం తరహాలోనే ఉండేలా ప్లాన్‌ చేశారు. ఇందులో కొత్త హీరోయిన్‌ ఉండాలని భావించిన దర్శకుడు.. అదితిని కథానాయికగా ఎంపిక చేశారు. ఇందులో మదురై యాసలో అదితి డైలాగులుంటాయి. ఇందుకోసం ఆ విధంగా మాట్లాడడం అనతికాలంలోనే నేర్చుకున్న అదితి... తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను సింగిల్‌ టేక్‌లో పూర్తి చేస్తోందట. ఈ విషయాన్ని దర్శకుడు ముత్తయ్య స్వయంగా వెల్లడిస్తూ, ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుండగా, హీరో సూర్య 2డి ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. 



Updated Date - 2021-09-25T22:27:18+05:30 IST