షకీల సొంత ఓటీటీ...

ABN , First Publish Date - 2021-07-17T04:15:39+05:30 IST

నూతన నటీనటులతో రమేష్‌ కావలి దర్శకత్వంలో రూపొందుతున్న ‘అట్టర్‌ ప్లాప్‌’, ‘రొమాంటిక్‌’ చిత్రాల టైటిల్‌ పోస్టర్లను చిత్ర నిర్మాత, నటి షకీల శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘ఈ రెండు....

షకీల సొంత ఓటీటీ...

నూతన నటీనటులతో రమేష్‌ కావలి దర్శకత్వంలో రూపొందుతున్న ‘అట్టర్‌ ప్లాప్‌’, ‘రొమాంటిక్‌’ చిత్రాల టైటిల్‌ పోస్టర్లను చిత్ర నిర్మాత, నటి షకీల శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘ఈ రెండు చిత్రాల్లో నా కూతురు మిలా హీరోయిన్‌గా నటిస్తోంది. గోవాలో అందమైన లొకేషన్లలో షూటింగ్‌ చేస్తున్నాం. కొత్తగా చిత్ర పరిశ్రమలోకి వచ్చే వారికి ఇబ్బంది లేకుండా కె. ఆర్‌ డిజిటల్‌ ప్లెక్స్‌ పేరుతో సొంతంగా ఓటీటీని ప్రారంభిస్తున్నాం’’ అని చెప్పారు. ప్రస్తుతం కె.ఆర్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో ‘అట్టర్‌ప్లాప్‌’, ‘రొమాంటిక్‌’ చిత్రాలు చేస్తున్నాం. ముందు ముందు ఈ బేనర్‌లో మరిన్ని చిత్రాలు చేస్తాం’’ అని దర్శకుడు తెలిపారు.

Updated Date - 2021-07-17T04:15:39+05:30 IST